Year end sale: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. ఇయర్ ఎండ్ సేల్‌లో భారీ డిస్కౌంట్స్.
బిగ్ ఇయర్ ఎండ్ సేల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను అందించనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ మొదలు ఫ్యాషన్, ఫర్నిచర్ వరకు ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే క్యాష్‌బ్యాక్‌తో పాటు పాటు...

2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఏడాది ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాత ఏడాదికి వీడ్కోలు చెప్పేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. ఇక దీనినే ఈకామర్స్ సైట్స్ సైతం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే సేల్‌ను అందిస్తోంది.
బిగ్ ఇయర్ ఎండ్ సేల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను అందించనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ మొదలు ఫ్యాషన్, ఫర్నిచర్ వరకు ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే క్యాష్‌బ్యాక్‌తో పాటు పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎమ్‌ఐ వంటి ఆఫర్లను అందిస్తోంది.
ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతోపాటు ఫ్యాషన్, హోం అప్లియెన్సెస్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రూ. 69,900 విలువైన ఐఫోన్ 14ని రూ. 55 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక రూ. 34,999 విలువ చేసే మోటరోలా ఎడ్జ్40 ఫోన్‌ను రూ.25,499లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ రూ. 7,149కే పొందొచ్చు. నథింగ్ ఫోన్ 2 అసలు ధర రూ. 39,999 కాగా, రూ. 34,999కే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసత్ఏ అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో పాటు ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై నో-కాస్ట్ ఈఎంఐ అవకాశాన్ని కల్పిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..