Nothing Phone 3: నథింగ్ ఫోన్3పై అప్పుడే మొదలైన ఆసక్తి.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే
అనతికాలంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నథింగ్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రెండు ఫోన్‌లు విడుదలయ్యా. వీటిలో నథింగ్ ఫోన్-1 2022లో ప్రారంభంకాగా, నథింగ్ ఫోన్-2 2023లో లాంచ్ అయ్యింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నథింగ్ సిరీస్ నుంచి మూడో ఫోన్ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడులవుతుందన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, వచ్చే ఏడాది...

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ లాంచ్ చేసిన ఫోన్‌లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2020లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి అమ్మకాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.
అనతికాలంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నథింగ్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రెండు ఫోన్‌లు విడుదలయ్యా. వీటిలో నథింగ్ ఫోన్-1 2022లో ప్రారంభంకాగా, నథింగ్ ఫోన్-2 2023లో లాంచ్ అయ్యింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నథింగ్ సిరీస్ నుంచి మూడో ఫోన్ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు విడులవుతుందన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, వచ్చే ఏడాది మధ్యలో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. వీటి ఆధారంగా అసలు ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండొచ్చనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నథింగ్ ఫోన్ 3ని మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, ఎల్ఈడీ లైట్లు, నోటిఫికేష్ లైట్స్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ ఫోన్‌లో కెమెరాను కూడా అప్‌డేట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇక నథింగ్ ఫోన్ 3లో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో అమోఎల్‌ఈడీతో కూడిన డిస్‌ప్లేను ఇస్తున్నారని టాక్. అలాగే ట్రిపుల్ రెమెరా సెటప్, పంచ్ హోల్ డిస్‌ప్లేతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. 5జీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుందీ ఫోన్.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. నథింగ్‌ఫోన్‌ను రూ. 32,999గా లాంచ్ చేశారు. అయితే నథింగ్ ఫోన్ 2ని మాత్రం రూ. 44,999కి తీసుకొచ్చారు. దీంతో నథింగ్ ఫోన్3 ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర రూ. 50 వేలకిపైమాటే అని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..