మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి. చాలా డేంజర్..
అయితే ప్రతీ అవసరానికి ఓ యాప్ వచ్చిందని సంతోషించాలో ఫేక్ యాప్స్ కొంప ముంచుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్‌ను లక్ష్యంగా చేసుకొని యూజర్ల డేటాను సేకరిస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసే సమయంలో పర్మిషన్స్ అడిగి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్నికొన్ని యాప్స్ కాజేస్తున్నాయి. ఇలాంటి వాటిలో లోన్ యాప్స్ మొదటి వరుసలో ఉంటున్నాయి.

స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారిన రోజులివీ. డబ్బులు చెల్లించడం మొదలు, సినిమా టికెట్ బుకింగ్ వరకు ప్రతీ అవసరానికి ఒక యాప్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాప్స్ వినియోగం భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా టెక్ కంపెనీలు సైతం కొంగొత్త యాప్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే ప్రతీ అవసరానికి ఓ యాప్ వచ్చిందని సంతోషించాలో ఫేక్ యాప్స్ కొంప ముంచుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఈ యాప్స్‌ను లక్ష్యంగా చేసుకొని యూజర్ల డేటాను సేకరిస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసే సమయంలో పర్మిషన్స్ అడిగి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్నికొన్ని యాప్స్ కాజేస్తున్నాయి. ఇలాంటి వాటిలో లోన్ యాప్స్ మొదటి వరుసలో ఉంటున్నాయి.
లోన్ తీసుకున్న వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ అధిక వడ్డీ రాబడుతున్నాయి. ఇలాంటి కొన్ని యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తాజాగా తెలియజేశారు. కొన్ని యాప్‌లు భారత్ సహా.. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఈసెట్ తెలిపింది. మొత్తం 18 యాప్‌లు గుర్తించగా గూగుల్ ఇప్పటికే 17 యాప్స్‌ను తొలగించింది. గూగుల్ ప్లేస్టోర్ లో నుంచి తొలగించిన యాప్స్ జాబితా ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఏ క్రెడిట్, అమోర్ క్యాష్, గేయబాక్యాష్, ఈజీ క్రెడిట్, క్యాష్‌వావ్, క్రెడిబస్, ఫ్లాష్‌లోన్, ప్రెస్టమోస్‌క్రెడిటో, ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్, గో క్రెడిటో, ఇన్స్టంటానియో ప్రెస్టమో, కార్టెరా గ్రాండే, రాపిడో క్రెడిటో, ఫైనప్ లెండింగ్, ఫోర్‌ఎస్ క్యాష్, ట్రూనైరా, ఈజీ క్యాష్. మీ ఫోన్‌లో ఒకవేళ ఈ యాప్స్‌లో ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయడండని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..