APPLE iPhone 14: ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. కేవలం 12 వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌

ఇక మార్కెట్లో యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్‌ను ఒక్కసారైనా ఉపయోగించాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అయితే ధర ఎక్కువగా ఉండడంతో ఈ ఫోన్‌ కొనుగోలు చేయడానికి దూరంగా ఉంటారు. అయితే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. యాపిల్‌ ఇటీవల లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 14కి మంచి ఆదరణ లభించింది...

APPLE iPhone 14: ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. కేవలం 12 వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
Iphone 14
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 12, 2023 | 7:26 PM

పండుగల సీజన్‌ సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డ ఈ కామర్స్‌ సంస్థలు సేల్స్‌ నిర్వహిస్తున్నాయి. దసరాకు మొదలైన ఈ సేల్స్‌ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం పలు పేర్లతో సేల్స్‌ఉన అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి.

ఇక మార్కెట్లో యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్‌ను ఒక్కసారైనా ఉపయోగించాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అయితే ధర ఎక్కువగా ఉండడంతో ఈ ఫోన్‌ కొనుగోలు చేయడానికి దూరంగా ఉంటారు. అయితే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. యాపిల్‌ ఇటీవల లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 14కి మంచి ఆదరణ లభించింది. అయితే ఐఫోన్‌ 13తో పోల్చితే 14లో పెద్దగా ఫీచర్స్‌ అప్‌డేట్స్‌ లేవని కస్టమర్లు కాస్త నిరూత్సాహపడ్డారు.

ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ 14 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 69,900గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ 17 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 57,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక డిస్కౌంట్‌ ఇంతటితో ఆగిపోలేదు. ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఫోన్‌పై సుమారు రూ. 5700 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ. 52,000కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌పై ఫ్లిప్‌ కార్ట్ మరో ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద గరిష్టంగా రూ. 46,000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ లెక్కన పూర్తి ఎక్స్ఛేంజ్‌ పొందితే ఐఫోన్‌ 14ని కేవలం రూ. 12 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 14 ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తారు. 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్‌, 12 మెగాపిక్సెల్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు. ఏ15 బయోనిక్‌ చిప్‌, 6 కోర్‌ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఐఓఎస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై 8,2.11, డ్యూయల్ బాండ్‌, హాట్‌స్పాట్‌, బ్లూటూత్‌ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఐఫోన్‌ 14 ఫోన్‌లో ఎల్‌ఐ-ఐయాన్‌ 3279 ఎమ్‌ఏహెచ్‌ నాన్‌ రిమూవబుల్ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..