Croma Offers: క్రోమాలో కొల్లగొట్టే ఆఫర్లు… స్మార్ట్ గ్యాడ్జెట్స్‌పై ఆఫర్ల వరద

వాలెంటైన్స్ డే సందర్భంగా క్రోమా సరికొత్త టెక్ గాడ్జెట్‌లలో అద్భుతమైన ఆఫర్‌లతో మన ముందుకు వచ్చింది. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్బంగా క్రోమా తీసుకొచ్చిన ఆఫర్లు ఇంకా అందుబాటులోఉన్నాయి. ఇది ఇన్‌స్టంట్ కెమెరాలతో జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడం దగ్గర నుంచి గేమింగ్ అనుభవాలను మెరుగుపరిచే వివిధ ఆఫర్లు క్రోమా సేల్‌లో లైవ్‌లో ఉన్నాయి.

Croma Offers: క్రోమాలో కొల్లగొట్టే ఆఫర్లు… స్మార్ట్ గ్యాడ్జెట్స్‌పై ఆఫర్ల వరద
Online Shopping
Follow us
Srinu

|

Updated on: Feb 15, 2024 | 7:00 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే సందడి నెలకొంది. ప్రేమికుల రోజున ప్రియమైన వారికి మంచి బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు వాలెంటైన్స్ డే ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా క్రోమా సరికొత్త టెక్ గాడ్జెట్‌లలో అద్భుతమైన ఆఫర్‌లతో మన ముందుకు వచ్చింది. అయితే ప్రేమికుల దినోత్సవం సందర్బంగా క్రోమా తీసుకొచ్చిన ఆఫర్లు ఇంకా అందుబాటులోఉన్నాయి. ఇది ఇన్‌స్టంట్ కెమెరాలతో జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడం దగ్గర నుంచి గేమింగ్ అనుభవాలను మెరుగుపరిచే వివిధ ఆఫర్లు క్రోమా సేల్‌లో లైవ్‌లో ఉన్నాయి. ఈ సేల్‌లో అసాధారణమైన ధరల్లో గొప్ప తగ్గింపులు, ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్‌లు, అనేక రకాల ఉత్పత్తులను ఆశ్వాదించవచ్చు. 

వన్‌ప్లస్ ప్యాడ్ వైఫై ఆండ్రాయిడ్ టాబ్లెట్

వన్‌ప్లస్ ప్యాడ్ వైఫై ఆండ్రాయిడ్ టాబ్లెట్ 11.61 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ + 256 జీబీ స్టోరేజీ వేరింయట్‌తో వస్తుంది. ఈ టాబ్లెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో నడుస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9510 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టాబ్లెట్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డాల్బీ అట్మోస్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. క్రోమాలో రూ.39,999 అందుబాటులో ఉంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 

ఆసస్ టీయూఎఫ్ గేమింగ్ ఎఫ్ 15

క్రోమాలో ఈ వాలెంటైన్స్ డేలో గేమర్స్ కోసం ఒక ప్రధాన ఎంపిక అయిన ఆసస్ టీయూఎఫ్ గేమింగ్ ఎఫ్ 15 ల్యాప్‌టాప్ ఐ5 11వ జెనరేషన్ ప్రాసెసర్, నివిడా జీఈ ఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2050 గ్రాఫిక్‌లతో ఆధారితమైన 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ల్యాప్ టాప్ 8 జీబీ + 512జీబీ ఎస్ఎస్డీ వేరియంట్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 77,990గా ఉంది. అయితే ప్రస్తుతం వాలెంటైన్ ఆఫర్లలో భాగంగా రూ.52,990కు అందుబాటులో ఉంది. ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.3,500 తక్షణ తగ్గింపు, అలాగే రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో

వాలెంటైన్స్ డే ఆఫర్ కోసం యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో (2వ జెనరేషన్) అందుబాటులో ఉన్నాియ. ఈ ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, గరిష్టంగా 30 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరి వాయిస్ అసిస్టెంట్, ఐపీ 54 వాటర్, డస్ట్-రెసిస్టెంట్‌తో ఉంటాయి. అడాప్టివ్ ఈక్యూ అత్యుత్తమ మ్యూజిక్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. ఈ సేల్‌లో ఈ ఇయర్ బడ్స్ రూ.23,599కు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.3,500 తగ్గింపు లభిస్తుంది. 

ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 9 ఇన్‌స్టంట్ కెమెరా

ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 9 ఇన్‌స్టంట్ కెమెరా క్రోమా వాలెంటైన్స్ డే సేల్‌లో రూ.4999కు అందుబాటులో ఉంది. ఈ ఇన్‌స్టంట్ కెెమెరా తక్షణ జ్ఞాపకాలను సంగ్రహించడానికి సరిగ్గా సరిపోతుంది. ఇది ఆటోమేటిక్ ఎక్స్‌పోజర్ మోడ్, వ్యూఫైండర్, అంతర్నిర్మిత ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీ మిర్రర్, ప్రకాశవంతమైన ఫోటోల కోసం హై కీ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా అసలు ధర రూ.5,999గా ఉంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.3,000, ఈ ఎంై లావాదేవీలపై 3,500 తగ్గింపు లభిస్తుంది. 

నథింగ్ వాచ్ ప్రో

క్రోమాలో ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా నథింగ్ వాచ్ ప్రో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ 1.96 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వాచ్ అంతర్నిర్మిత జీపీఎస్‌తో వస్తుంది. ఈ వాచ్‌లో 110 స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 స్థాయిలు, నిద్ర విధానాలు, ఒత్తిడి స్థాయిల కోసం విస్తృతమైన ఆరోగ్య ట్రాకింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. 13 రోజుల బ్యాటరీ లైఫ్, ఐీప68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. ఈ సేల్‌లో ఈ వాచ్ రూ. 3,499కు కొనుగోలు చేయవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..