Google Privacy: యూజర్లకు గూగుల్ అలెర్ట్…ఏఐ విషయంలో మరిన్ని జాగ్రత్తలు కావాల్సిందే..!
ఇటీవల కాలంలో పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల సమస్యల్లో పడొద్దని గూగుల్ తన యూజర్లను హెచ్చరించింది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో సంబంధం ఉన్న సంభావ్య భద్రత, గోప్యతా ప్రమాదాల గురించి గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. గూగుల్‌కు సంబంధించిన జెమెనీ యాప్ ప్రైవసీ హబ్ బ్లాగ్ ద్వారా జెమిని యాప్‌లలో ఏదైనా సంభాషణ సమయంలో తమ రహస్య సమాచారాన్ని నమోదు చేయకుండా ఉండాలని కస్టమర్‌లను కోరింది.
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లు అనేవి మన జీవితంలో భాగమైపోయాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ వాడకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల సమస్యల్లో పడొద్దని గూగుల్ తన యూజర్లను హెచ్చరించింది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంతో సంబంధం ఉన్న సంభావ్య భద్రత, గోప్యతా ప్రమాదాల గురించి గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. గూగుల్‌కు సంబంధించిన జెమెనీ యాప్ ప్రైవసీ హబ్ బ్లాగ్ ద్వారా జెమిని యాప్‌లలో ఏదైనా సంభాషణ సమయంలో తమ రహస్య సమాచారాన్ని నమోదు చేయకుండా ఉండాలని కస్టమర్‌లను కోరింది. గూగుల్ తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
జెమిని యాప్‌లు సూపర్‌ఛార్జ్డ్ గూగుల్ అసిస్టెంట్‌ని పోలి ఉంటాయి. “దయచేసి మీ సంభాషణల్లో గోప్యమైన సమాచారాన్ని నమోదు చేయవద్దు లేదా సమీక్షకుడు చూడకూడదనుకునే ఏదైనా డేటాను నమోదు చేయవద్దు లేదా మా ఉత్పత్తులు, సేవలు, మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి గూగుల్ ఉపయోగించకూడదు.” అని పేర్కొంది. ఏదైనా సంభాషణ ఒకసారి సమీక్షిస్తే మీరు జెమిని యాప్‌ల కార్యకలాపాన్ని తొలగించిన తర్వాత కూడా అవి నిర్దిష్ట కాలానికి తీసివేస్తారని గూగుల్ పేర్కొంది. జెమినీ యాప్స్‌లో సంభాషణలు మాత్రం వేరుగా ఉంటాయి. ఆ సంభాషణలు ఏ వినియోగదారు గూగుల్ ఖాతాకు కనెక్ట్ అవ్వవు. అదనంగా జెమినీ యాప్స్ దగ్గర మీ రహస్య సమాచారాన్ని కలిగి ఉండే సంభాషణలు మూడు సంవత్సరాల వరకు ఉంచబడతాయి. ముఖ్యంగా మానవ సమీక్షకుల ద్వారా సమీక్షించిన సంభాషణలు మీరు మీ జెమిని యాప్‌ల కార్యకలాపాన్ని తొలగించినప్పుడు అవి విడిగా ఉంటాయి.
ముఖ్యంగా జెమినీ యాప్ కనెక్ట్ చేసినందున ఆ సంభాషణలు తొలగించవు. జెమిని యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉన్న తర్వాత కూడా యూజర్ సంభాషణ 72 గంటల వరకు వారి ఖాతాలో సేవ్ అవుతుందని వెల్లడించింది. జెమినీ యాప్స్ సేవను అందించడానికి లేదా ఏదైనా అభిప్రాయాన్ని ప్రాసెస్ చేయడానికి గూగుల్‌ను అనుమతిస్తుంది. ఈ యాక్టివిటీ మీ జెమిని యాప్స్ యాక్టివిటీలో కనిపించదు. అలాగే ఈ యాప్స్‌ను వాయిస్ యాక్టివేషన్‌తో సక్రియం చేయవచ్చు. అంటే “హే గూగుల్” లాగా శబ్దం ఉంటే జెమిని యాప్స్ ప్రతిస్పందించే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..