eBikeGo: ఎలక్ట్రిక్ సైకిల్ రంగంలోకి కొత్త కంపెనీ.. త్వరలోనే ప్రీ బుకింగ్.. దీని ఫీచర్స్ తెలుసుకోండి
ట్రాన్సిల్ ఈ 1 ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సైకిల్ ఈ బైక్ గో బీ2సీ వర్టికల్. ఇకపై తమ కంపెనీలో ఎలక్ట్రిక్ వాహనాలు ట్రాన్సిల్ బ్రాండ్ పేరుతో ఆవిష్కరిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.44,999 గా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఈ సైకిల్ మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్ ఫారమ్ ఈ బైక్ గో ఎలక్ట్రిక్ సైకిల్ రంగంలోకి ప్రవేశిస్తుంది. తమ కొత్త ఉత్పత్తి ట్రాన్సిల్ ఈ 1 ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సైకిల్ ఈ బైక్ గో బీ2సీ వర్టికల్. ఇకపై తమ కంపెనీలో ఎలక్ట్రిక్ వాహనాలు ట్రాన్సిల్ బ్రాండ్ పేరుతో ఆవిష్కరిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.44,999 గా నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఈ సైకిల్ మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఈ సైకిల్ తక్కువ దూరం ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. అడాప్టివ్ మొబిలిటీ ద్వారా అభివృద్ధి చేసిన ఈ సైకిల్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ వాహనం పూర్తిగా బీమాతో వినియోగదారులకు చేతికి వస్తుంది. అలాగే తమ ఉత్పత్తులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పర్యావరణహితంగా ఇస్తాయని తెలిపారు.
ట్రాన్సిల్ ఈ 1 స్పెసిఫికేషన్లు ఇవే
- సింగిల్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో యూనిసెక్స్ స్టీల్ ఫ్రేమ్ ఈ సైకిల్ ప్రత్యేకత
- స్మార్ట్ బీఎంఎస్ తో వర్క్ చేసే 250 డబ్ల్యూ లి-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. చార్జింగ్ కంట్రోల్ కోసం అల్గోరిథం కూడా వస్తుంది.
- అలాగే రోజుకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ ప్రయాణించే వ్యక్తికి పత్యామ్నాయంగా ఉంటుంది. అంటే కిలోమీటర్ కు కేవలం 5 పైసల ఖర్చుతో ప్రయాణించవచ్చు.
- స్పీడ్ లిమిట్ ఫంక్షన్ తో వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వస్తుంది.
- ఆటో కట్-ఆఫ్ ఫంక్షన్ స్మార్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు. అలాగే పోర్టబుల్ బ్యాటరీతో డెస్క్ చార్జింగ్, ఆన్ బోర్డ్ చార్జింగ్ ఫెసిలిటీ
- ఎల్ఈడీ స్మార్ట్ డిస్ ప్లేతో యూజర్ ఇంటర్ ఫేస్
- అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 20 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్
- యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, ఓ సారి చార్జ్ చేయడానికి 2.5 గంటలు పడుతుంది.
- పవర్ మోడ్ పెడల్ అసిస్ట్. డబుల్ వాల్డ్ అల్లాయ్ రిమ్స్, సూపర్ టైర్స్, సమర్థవంతమైన సస్పెన్షన్ తో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..