Wifi: ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై.. సెకనుకు ఏకంగా 90 జీబీ
ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యం. చిన్న చిన్న గ్రామాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ వేగం ఊహకందని స్థాయిలో పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే గంటల సమయం పట్టేది కానీ ప్రస్తుతం.. క్షణాల్లో సినిమాలు డౌన్‌లోడ్ అవుతున్నాయి...
ప్రస్తుతం ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యం. చిన్న చిన్న గ్రామాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ వేగం ఊహకందని స్థాయిలో పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే గంటల సమయం పట్టేది కానీ ప్రస్తుతం.. క్షణాల్లో సినిమాలు డౌన్‌లోడ్ అవుతున్నాయి. మారిన కాలంతో పాటు ఇంటర్నెట్ సేవల్లోనూ భారీ మార్పులు వచ్చాయి.
అయితే ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ ఏంటి.? దీంతో వీడియోలను ఎంత వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ చైనా దేశంలో అందుబాటులో ఉంది. క్లౌడ్ బ్రాడ్ బ్యాండ్ పేరుతో ఈ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌గా క్లౌడ్ బ్రాడ్‌బ్యాండ్‌కు పేరుంది. ఈ టెక్నాలజీ సహాయంతో ఒక్క నిమిషంలో 9సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదికూడా 8కే రిజల్యూషన్‌తో కూడుకున్న వీడియోలు కావడం విశేసం.
ఈ సేవలను F5G-A (మెరుగైన ఆల్-ఆప్టికల్ నెట్‌వర్క్) అని పిలుస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి 10G క్లౌడ్ బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనిటీ షాంఘైలో 50G-PON టెక్నాలజీతో ప్రారంభించారు. ఈ సేవలు చైనా టెలికాం షాంఘై కంపెనీతో పాటు యాంగ్‌పు ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఈ టెక్నాలజీలో లైటింగ్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించారు. ఈ క్లౌడ్ బ్రాడ్‌బ్యాండ్ ఏకంగా 10 గిగాబైట్ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ స్పీడ్‌తో 8కే వీడియో క్వాలిటీతో 2 గంటల 90జీబీ మూవీని కేవలం 72 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
చైనాకు చెందిన అల్ట్రా ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీ మీ స్మార్ట్ హోమ్ టెక్నాలజీని మెరుగుపరుస్తుంది. ఈ టెక్నాలజీలో, రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, లాగ్ ఫ్రీ కమ్యూనికేషన్‌తో 10G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ స్పీడ్‌తో ఆన్‌లైన్‌లో ఎక్కువ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే యూజర్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువ డేటా ఉన్న వీడియోలు స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఇంటర్నెట్ సేవలు ఉపయోగపడతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..