Redmi watch 5: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్స్‌.. రెడ్‌మీ నుంచి కొత్త వాచ్‌..

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్‌ సంస్థలు వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ వాచ్‌5 యాక్టివ్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Aug 29, 2024 | 12:52 PM

 చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ వాచ్‌5 యాక్టివ్‌ పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌ ధర కేవలం రూ. 3వేలలోపు ఉండడం విశేషం. మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు.

1 / 5
 రెడ్‌మీవాచ్‌ 5 యాక్టివ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 2 ఇంచెస్‌తో కూడి ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ పనిచేస్తుంది. దీంతో సన్‌లైట్‌లోనూ వాచ్‌ డిస్‌ప్లేను స్పష్టంగా చూడొచ్చు.

2 / 5
హైపర్‌ఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ వాచ్‌ పనిచేస్తుంది. ఇందులో 200కిపైగా క్లౌడ్‌ వాచ్‌ ఫేస్‌లను అందించారు. ఇందులో ఎమ్‌ఐ ఫిట్‌నెస్‌ యాప్‌ను అందించారు. IPX8 రేటింగ్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్‌ దుమ్ము, నీటి నుంచి ప్రొటక్షన్‌తో తీసుకొచ్చారు.

3 / 5
ఇక ఈ వాచ్‌లో 140కి పైగా స్పోర్ట్స్‌ మోడ్‌లను ఇచ్చారు. స్పష్టమైన కాలింగ్ కోసం, కంపెనీ వాచ్‌లో మూడు మైక్‌లతో కూడిన ENC సెటప్‌ను కూడా ఇచ్చారు. ఈ వాచ్‌లో శక్తివంతమైన 470mAh బ్యాటరీని ఇచ్చారు. ఈ బ్యాటరీ మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

4 / 5
ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. హార్ట్‌ బీట్‌,  యాక్సిలరోమీటర్ మరియు SpO2 సెన్సార్ వంటి హెల్త్‌ ఫీచర్స్‌ అందించారు. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రెడ్‌మి వాచ్ 5 యాక్టివ్‌ను రూ. 2799కి లభిస్తుంది.

5 / 5
Follow us