Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మీకు తెలుసా.?
ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియకపోతే పక్కనున్న వారిని ఎవరినైనా అడిగి తెలుసుకొని వెళ్లేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. టెక్నాలజీ రాకతో పనులు చాలా సులువు అయ్యాయి. గూగుల్ మ్యాప్స్ రాకతో ఎవరి అడగకుండానే అడ్రస్‌లు తెలిసిపోతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఒక చిన్న క్లిక్‌తో ఇట్టే అడ్రస్‌లు తెలుసుకునే రోజులు వచ్చేశాయ్...

ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియకపోతే పక్కనున్న వారిని ఎవరినైనా అడిగి తెలుసుకొని వెళ్లేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. టెక్నాలజీ రాకతో పనులు చాలా సులువు అయ్యాయి. గూగుల్ మ్యాప్స్ రాకతో ఎవరి అడగకుండానే అడ్రస్‌లు తెలిసిపోతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఒక చిన్న క్లిక్‌తో ఇట్టే అడ్రస్‌లు తెలుసుకునే రోజులు వచ్చేశాయ్. అయితే మనం ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌లో మనకు తెలియని కొన్ని సీక్రెట్ ఫీచర్లు ఉన్నాయిని మీకు తెలుసా.? ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్లలో స్ట్రీట్ వ్యూ టైమ్ ట్రావెల్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ సహాయంతో మీరు కాలంతో వెనక్కి వెళ్లొచ్చు. అంటే మీరు ఎంచుకున్న ఒక ప్రదేశం గతంలో ఎలా ఉందో చూసుకోవాలి. తేదీ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఆప్షన్ కేవలం కొన్ని ప్రదేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది.
* మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న మరో ఆసక్తికరమైన ఫీచర్ నావిగేషన్. ఈ ఫీచర్ సహాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండానే మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం తొలుత మ్యాప్‌లో లొకేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రదేశాలకు వెళ్లే ముందు అక్కడి లొకేషన్ ఓపెన్ చేస సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
* ఇక మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించినది. జెమిని ఏఐ ఫీచర్ సహాయంతో మీరు ప్రయాణిస్తున్న సమయంలో నావిగేట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ సహాయంతో ఈ నావిగేషన్ చేసుకోవచ్చు.
* మ్యాప్స్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ సెట్టింగ్ ఫీచర్‌ను అందించారు. ఇది ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోసం తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో గూగుల్ మ్యాప్స్‌లో ఈవీ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.
* గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌తో సహాయంతో ఏదైనా హోటల్‌లో డిన్నర్ టేబుల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి హోటల్‌కి సమీపంలో సెర్చ్ చేయాలి. మీకు దగ్గర్లలో ఉన్న రెస్టారెంట్ల జాబితా కనిపిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




