Telecom: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి.. సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి

ఇందులో భాగంగానే టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) త్వరలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో సిఫార్సు చేసింది. ఈ మార్పులు లోక్‌సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది....

Telecom: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి.. సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి
New Sim Card
Follow us

|

Updated on: May 23, 2024 | 7:33 AM

నకిలీ సిమ్‌ కార్డులు, సైబర్‌ మోసాలు ఇటీవల భారీగా పెరిగిపోతున్నాయి. ఇతరుల ఐడీ ప్రూఫ్‌లతో సిమ్ కార్డులు తీసుకుంటే నేరాలకు పాల్పడుతున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే టెలికాం రంగంలోకి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇకపై కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలంటే కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు.

ఇందులో భాగంగానే టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) త్వరలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై డాట్‌కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో సిఫార్సు చేసింది. ఈ మార్పులు లోక్‌సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ సిమ్‌కార్డులు, సైబర్‌ మోసాలు తగ్గించేందుకు గాను ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి.

ఈ నిబంధనల ప్రకారం ఇకపై కొత్తగా ఎవరైనా సిమ్‌ తీసుకోవాలనుకుంటే.. తప్పనిసరిగా బయోమెట్రిక్‌ గుర్తింపు ఉండాల్సి ఉంటుంది. యూజర్ల నుంచి సమాచారాన్ని సేకరించే క్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్‌ జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే.. సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ కొత్త నిబంధనలను సెప్టెంబర్‌ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో నియమ, నిబంధనలకు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. భారత పార్లమెంటు 2023 డిసెంబరు 20న టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 (Telecom Act 2023)ని ఆమోదించిన విషయం తెలిసిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles