Android 15: సరికొత్త ‘డోజ్ మోడ్’తో డోస్ పెంచేసిన గూగుల్.. అందుబాటులోకి కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్!
స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ తన ఆండ్రాయిడ్ 15 బీటా 2 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ తో ముందుకు వస్తోంది. దీనిలో కొత్త డోజ్ మోడ్‌తో ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. త్వరలో రానున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పరికరం గోప్యత, భద్రతా లక్షణాలను మెరుగుపరచడం, బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి కొత్త అప్ డేట్లు ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ అనేది నేడు కనీస అవసరంగా మారింది. అది లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్లలో అనేక కొత్త ఫీచర్లు వస్తున్నాయి. మన అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు. ఈ ఫోన్లన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స పై ఆధారపడి పని చేస్తాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఆండ్రాయిస్ 15 బీటా 2 ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించింది. దాని ప్రత్యేకతలను తెలుసుకుందాం.
కొత్త ఆపరేటింగ్ సిస్టమ్..
స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ తన ఆండ్రాయిడ్ 15 బీటా 2 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ తో ముందుకు వస్తోంది. దీనిలో కొత్త డోజ్ మోడ్‌తో ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. త్వరలో రానున్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పరికరం గోప్యత, భద్రతా లక్షణాలను మెరుగుపరచడం, బ్యాటరీ జీవితాన్ని పెంచడానికి కొత్త అప్ డేట్లు ఉన్నాయి. అవి ఫోన్ పనితీరును మెరుగుపర్చడంతో పాటు భద్రతను అందిస్తాయి. వినియోగదారులకు సౌకర్యంగా ఉంటాయి.
గూగుల్ ఆవిష్కరణ..
ఇటీవల జరిగిన గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఐ/ఓ 2024లో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను (Android 15 Beta 2) ఆ సంస్థ ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ ఓఎస్ అప్ డేట్ ను గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్ పొందింది. ఈ ఓఎస్ పూర్తి స్థాయి వెర్షన్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో విడుదల కానుంది.
అనేక ఫీచర్లు..
గూగుల్ కు సంబంధించి ఆండ్రాయిడ్ 15 బీటా 2 ఆపరేటింగ్ సిస్టమ్ లో అనేక అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని కోసం కోట్లాది మంది ఆండ్రాయిడ్ వినియోగదారుల వేచి చూస్తున్నారు. దీనిలో భద్రతా లక్షణాలతో పాటు బ్యాటరీ బ్యాకప్‌లో మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. ఫోన్ బ్యాటరీ లైన్ ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ 14 కంటే ఎక్కువగా ఉంటుంది.
డోజ్ మోడ్ అంటే..
ఆండ్రాయిడ్ 15 బీటా 2 ఆపరేటింగ్ సిస్టమ్‌లో డోజ్ మోడ్ అందుబాటులో ఉందని చాలా మంది డెవలపర్లు గమనించారు. ఇది ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని 50 శాతం మెరుగుపరుస్తుంది. ఈ మోడ్‌లో ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ ఆగిపోతుంది. సిస్టమ్ వనరులకు యాప్ యాక్సెస్ తొలగించబడుతుంది. దీంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్ స్టాండ్‌బై సమయాన్ని 3 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఫోన్ బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడానికి ఆండ్రాయిడ్ 14 లేదా అంతకుముందు ఆపరేటింగ్ సిస్టమ్‌లో పవర్ సేవింగ్ మోడ్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా డోజ్ మోడ్ రానుంది.
భద్రత కోసం..
కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లో మూడు కొత్త భద్రతా ఫీచర్లను రూపొందించారు. వీటిని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 15లో ప్రైవేట్ సేఫ్, థెఫ్ట్ డిటెక్షన్ లాక్, రియల్ టైమ్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అనే కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇవి యూజర్లకు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే స్పామ్ కాల్‌ను నిజ సమయంలో కూడా గుర్తించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




