DART Mission: నాసా డార్ట్‌ మిషన్‌ ప్రయోగం విజయవంతం.. ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన వ్యోమనౌక..

DART Mission: భూమికి ముప్పు తప్పేలా గ్రహశకలాలను దారిమళ్ళించే బృహత్తర ప్రాజెక్టులో అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా కీలక ఘట్టాన్ని విజయవంతంగా..

DART Mission: నాసా డార్ట్‌ మిషన్‌ ప్రయోగం విజయవంతం.. ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన వ్యోమనౌక..
Nasa Dart Mission
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 27, 2022 | 12:45 PM

DART Mission: భూమికి ముప్పు తప్పేలా గ్రహశకలాలను దారిమళ్ళించే బృహత్తర ప్రాజెక్టులో అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను దారి మళ్లించే డార్ట్ మిషన్ ప్రయోగం విజయవంతం అయ్యింది. డైమార్ఫస్ అనే ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టింది డార్ట్ వ్యోమనౌక. ఈ మిషన్ విజయాన్ని అధికారికంగా ప్రకటించింది నాసా. భూమి వైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను దారి మళ్ళించేందుకు డార్ట్ పేరిట నాసా ఓ ప్రాజెక్టును గతంలోనే ప్రారంభించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27 తెల్లవారుజామున 4.44 గంటలకు నాసా అంతరిక్ష నౌక ఓ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది. తద్వారా దాన్ని దారి మళ్ళించేందుకు యత్నించింది. సుమారు 2500 కోట్ల విలువైన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌, డైమార్ఫస్‌ అనే గ్రహశకలాన్ని గంటకు 2,250 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించి డైమార్ఫస్‌ను ఢీకొట్టినట్టు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్ళించడం ద్వారా భూమికి ముప్పు తప్పించాలన్న ఉద్దేశం తో ఈ ప్రయోగం చేపట్టారు శాస్త్రవేత్తలు. అయితే ఇలా అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని, అధ్యయనానికి మరికొంత సమయం పడుతుందని వాళ్లు తెలిపారు. ఈ ప్రయోగంతో భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించ వచ్చనేది శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. కాగా, గ్రహశకలాల నుంచి భూమిని కాపాడటమే లక్ష్యంగా నాసా తొలిసారిగా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్వయంచాలకంగా ఆస్టరాయిడ్‌ను లక్ష్యంగా చేసుకుని, ఢీకొడుతుంది.

గూగుల్ సెలబ్రేషన్.. అయితే, డార్ట్ మిసన్ విజయవంతం అవడంపై గూగుల్ సెలబ్రేట్ చేస్తోంది. తెల్లవారుజామున ఈ మిషన్ ప్రయోగం చేయడం వలన భారతీయులు చూడలేకపోయారు. ఈ నేపథ్యంలో మిషన్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు.. ఆ వ్యోమనౌక గ్రహశకలాన్ని ఢీకొన్న వార్తల సంకలనం కనిపిస్తోంది. అదే సమయంలో స్క్రీన్‌పై ఆ మిషన్ జరిగిన తీరుకు సంబంధించిన గ్రాఫిక్ విజువల్ దర్శనమిస్తోంది. ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..