ఒకే ఈమెయిల్‌తో అన్ని పనులను చేసే వ్యక్తులలో మీరున్నారా? అయితే, తీవ్రమైన ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్ కోసం ఒకే ఈ మెయిల్ IDని ఉపయోగిస్తే.. అనుకోని ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఆన్‌లైన్ మోసగాళ్ల బారిలో చిక్కుకునే లిస్టులో కచ్చితంగా మీరుంటారు. ఈ సలహా ఇచ్చింది మరెవరో కాదు ప్రభుత్వవమే (Home Ministry). ఆర్థిక లావాదేవీలు(Financial Transaction), సోషల్ నెట్‌వర్కింగ్(Social Networking Sites) సైట్‌లలో రిజిస్ట్రేషన్ కోసం ఎప్పుడూ ఈ మెయిల్ ఐడీని ఉపయోగించవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ రెండు పనులకు వేర్వేరు ఈ మెయిల్ IDలను సృష్టించుకోవాలని సూచించింది. తద్వారా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదంటూ పలు సూచనలు చేసింది.
ఆన్‌లైన్ మోసంలో ఈ మెయిల్ ఐడీ కీలక పాత్ర..
మోసగాళ్లు ఫిషింగ్ మోసాలకు పాల్పడి నకిలీ మెయిల్స్ పంపుతుంటారు. దీంతో ఈమెయిల్‌లో ప్రమాదకరమైన లింక్‌లు వస్తుంటాయి. వాటిపై క్లిక్ చేసిన వెంటనే బ్యాంకులు లేదా సామాజిక సైట్‌లకు సంబంధించిన సమాచారం వారికి చేరుతుంది. ఈరోజుల్లో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు ఈ రకమైన మోసానికి అతిపెద్ద మాధ్యమంగా నిలుస్తున్నాయి. ఈ సైట్‌లలో వివిధ రకాల టెంప్టేషన్‌లు అందిస్తుంటారు. ఇలాంటి వారు ముసుగులో అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేసి, చాలాసార్లు వారి స్వంత సమాచారాన్ని ఇస్తుంటారు. తర్వాత వారి ఖాతా ఖాళీ అయిందని తేలింది. దీన్ని నివారించడానికి, రెండు ఈ మెయిల్ ఐడీలను సృష్టించడం మాత్రమే పరిష్కారం అంటూ తెలిపింది.
ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ దోస్త్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్‌ను నిర్వహిస్తోంది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సలహాలను అందిస్తుంది. ఆన్‌లైన్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉంటూనే.. మీ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో ఈ హ్యాండిల్ వివరిస్తుంది. సైబర్ దోస్త్ ఆన్‌లైన్ వినియోగదారులకు రెండు ఈ మెయిల్ ఐడీలను క్రియోట్ చేసుకోవాలని సలహా ఇచ్చింది.
కనీసం రెండు వేర్వేరు ఈ మెయిల్‌లను క్రియేట్ చేసుకోవాలని ట్వీట్‌లో పేర్కొంది. ఒక ఈ మెయిల్ ఖాతాతో ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకుంటూ, మరొక దాని నుంచి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల కోసం నమోదు చేసుకోవాలని కోరింది. ఈ రెండు పనులను ఒకే ఈమెయిల్‌తో చేయవద్దని కోరింది. ఇది మీ ప్రాథమిక ఖాతాను ఆన్‌లైన్ స్టాకర్స్ (ఆన్‌లైన్ మోసగాళ్ళు) నుంచి కాపాడుతుందంటూ సూచించింది.
ఈ మెయిల్ మోసం..
నేరస్థులు మొదట మీ ఈ మెయిల్ ఐడీని చూస్తారు. మీ చిన్నపాటి అజాగ్రత్త సైబర్ నేరగాళ్లకు ఈమెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. సైబర్ నేరగాళ్లు ఈమెయిల్ ద్వారా మీ పాస్‌వర్డ్ లేదా పిన్‌ను దొంగిలించడానికి మాల్వేర్‌ను ఉపయోగిస్తారు. మీ ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేసిన తర్వాత, సైబర్ నేరస్థులు సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు మొదలైన వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమాచారం వారి చేతుల్లోకి చేరిన తర్వాత, మీ ఖాతాను ఖాళీ చేయడం వారికి సులభం అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కోరింది.
Prefer to make at least two separate e-mail accounts. One may be for financial transactions and another e-mail account for registering on social networking sites. This will protect your primary account from online stalkers.
— Cyber Dost (@Cyberdost) May 11, 2022
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Hyundai Electric Car: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. త్వరలో భారతదేశంలో విడుదల