Mobile Charger: ఒక దేశం.. ఒకే ఛార్జర్.. ఈ నిబంధన భారత్‌లో అమలు కానుందా? కీలక మార్పులు

యూరోపియన్ యూనియన్ మాదిరిగా, ఒక ఛార్జర్ నియమాన్ని భారతదేశంలో కూడా అమలు చేయవచ్చు. వెలువడుతున్న నివేదికలను చూస్తే.. ఉమ్మడి ఛార్జింగ్ పోర్ట్ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నియమాన్ని అమలు చేసిన తర్వాత, అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు ఒక ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే అవసరం. ప్రభుత్వం టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను సాధారణం చేయవచ్చు..

Mobile Charger: ఒక దేశం.. ఒకే ఛార్జర్.. ఈ నిబంధన భారత్‌లో అమలు కానుందా? కీలక మార్పులు
Mobile Charger
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2024 | 3:16 PM

యూరోపియన్ యూనియన్ మాదిరిగా, ఒక ఛార్జర్ నియమాన్ని భారతదేశంలో కూడా అమలు చేయవచ్చు. వెలువడుతున్న నివేదికలను చూస్తే.. ఉమ్మడి ఛార్జింగ్ పోర్ట్ నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నియమాన్ని అమలు చేసిన తర్వాత, అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు ఒక ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే అవసరం. ప్రభుత్వం టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను సాధారణం చేయవచ్చు. యూరోపియన్ యూనియన్ 2022 సంవత్సరంలో ఈ నియమాన్ని ఆమోదించింది. ఆ తర్వాత Apple ఐఫోన్‌లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించాల్సి వచ్చింది. ఈ ఏడాది చివరిలోగా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: USB Socket: అడాప్టర్‌ అవసరం లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చు.. ఈ సాకెట్‌తో ఎన్ని మొబైల్స్‌ అయినా ఒకేసారి ఛార్జ్‌

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు ఒకే ఛార్జర్ నుండి ఛార్జింగ్‌:

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఛార్జర్‌ నియమాన్ని అమలు చేసినట్లయితే వినియోగదారులు తమ అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను ఒకే ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. నివేదికలను విశ్వసిస్తే, రాబోయే రోజుల్లో ల్యాప్‌టాప్‌లకు కూడా టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తుంది.

టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల కోసం తయారీదారులు ఒకే ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ నియమం 2026లో ల్యాప్‌టాప్‌ల కోసం అమలు చేయబడుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం ఇది జూన్ 2025లో అమలు చేయబడుతుంది.

ఇది కూడా చదవండి: WhatsApp Tips: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేయకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా?

యూరోపియన్ యూనియన్ 2022లో ఈ నిబంధనను ఆమోదించింది. ఆ సమయంలో యాపిల్ దీన్ని వ్యతిరేకించింది. కంపెనీ లైట్నింగ్ పోర్ట్ కోసం చాలా వాదించింది. కానీ వారు దానిలో విజయం సాధించలేదు. అయితే, గత సంవత్సరం కంపెనీ తన ఫోన్‌లలో లైట్నింగ్ పోర్ట్‌కు బదులుగా టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగించడం ప్రారంభించింది.

టైప్-సి పోర్ట్ ఉన్నప్పటికీ, ఐఫోన్ వేరొక బ్రాండ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు హీటింగ్‌ సమస్య ఎదుర్కొంటోంది. కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నప్పుడు ఆపిల్ ఈ విషయాన్ని వినియోగదారులకు తెలియజేసింది. ఇతర బ్రాండ్ల ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల ఐఫోన్‌లో సమస్యలు తలెత్తుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే