Comet Nishimura: ఆకాశంలో అద్భుతం.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 400 ఏళ్లకే కనిపించేది..
Comet Nishimura: సౌర వ్యవస్థ.. అద్భుతాలకు, ఆశ్ఛర్యకర దృశ్యాలకు, వేల కోట్ల ప్రశ్నలకు కేరాఫ్. ఇప్పటికీ తెలియని అనేక రహస్యాలు ఈ విశ్వాంతరాలంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా పరిష్కరించని అనేక రహస్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఆకాశ అద్భుతాల్లో ఒకటి కామెట్. దాని గురించి చాలా విషయాలు వినే ఉంటారు. కానీ దీనిని చాలా తక్కువగా చూసి ఉండవచ్చు.
Comet Nishimura: సౌర వ్యవస్థ.. అద్భుతాలకు, ఆశ్ఛర్యకర దృశ్యాలకు, వేల కోట్ల ప్రశ్నలకు కేరాఫ్. ఇప్పటికీ తెలియని అనేక రహస్యాలు ఈ విశ్వాంతరాలంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా పరిష్కరించని అనేక రహస్యాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఆకాశ అద్భుతాల్లో ఒకటి కామెట్. దాని గురించి చాలా విషయాలు వినే ఉంటారు. కానీ దీనిని చాలా తక్కువగా చూసి ఉండవచ్చు. కామెట్ అనేది తోక చుక్క. ఈ తోక చుక్క ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉంది.
జపాన్ ఖగోళ శాస్త్రవేత్త హిడియో నిషిమురా ఆగస్టు నెలలోనే కొత్త తోకచుక్కను కనుగొన్నారు. ఆస్ట్రోనామికల్ అసోసియేషన్ దీనికి నిషిమురా అని పేరు పెట్టింది. 400 సంవత్సరాల తరువాత, సెప్టెంబర్ 12 న.. ఈ తోకచుక్క భూమి నుండి 80 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. ఈ తోకచుక్కను ఇవాళ చూడలేకపోతే.. మళ్లీ సెప్టెంబర్ 17న ఆ అవకాశం పొందుతారు. అప్పుడు కూడా మిస్ అయితే.. దానిని చూసేందుకు మరో 400 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. అవును మరి.
కామెట్ అంటే ఏంటి?
కామెట్ అనేది ధూళి, మంచు, వాయువుల మిశ్రమంతో ఏర్పడిన సౌర వ్యవస్థలోని ఓ రాయి. ఇవి గ్రహాల వలె సూర్యుని చుట్టూ తిరుగుతాయి. కానీ వాటి మార్గం చాలా తక్కువగా ఉంటుంది. ఇది 50 నుండి 400 సంవత్సరాలలో సూర్యుని చుట్టూ తన భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. భూమిపై నుంచి కనిపించిన చివరి కామెట్ 1986లో కనిపించిన హాలీ కామెట్. మరోసారి ఇది 2061లో కనిపించే అవకాశం ఉంది. కానీ నిషిమురా కామెట్ సూర్యుని చుట్టూ దాని కక్ష్యను సుమారు 400 సంవత్సరాలలో పూర్తి చేస్తుంది. కనుక ఇది 400 సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపిస్తుంది.
ఇవాళే కనువిందు చేయనుంది..
కామెట్ నిషిమురా గంటకు 240,000 మైళ్ల వేగంతో కదులుతోంది. దీనిని కంటితో చూడవచ్చు, ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దాని ప్రకాశం మరింత పెరుగుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇది తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య ఈశాన్య హోరిజోన్‌లో కనిపిస్తుంది. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ మేనేజర్ పాల్ చోడాస్ ప్రకారం.. మంచి టెలిస్కోప్ ఉంటే దానిని స్పష్టంగా చూడవచ్చు.
సెప్టెంబర్ చివరి వరకు కనిపిస్తుంది..
వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త జియాన్లూకా మాసి ప్రకారం.. ఇది బుధవారం తర్వాత ఉత్తర అర్ధగోళం నుండి అదృశ్యమవుతుంది. ఈ కామెట్ సూర్యుని వెలుతురులో కలిసిపోతే.. ఒక వారం తర్వాత లేదా సెప్టెంబర్ చివరి నాటికి మళ్లీ కనిపించే అవకాశం ఉంది. ఈ తోకచుక్క చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు ఖగోళ పరిశోధకులు. ఇది సూర్యుని నుండి తప్పించుకుంటే.. సెప్టెంబర్ 17 న దక్షిణ అర్ధగోళంలో సాయంత్రం కనిపిస్తుంది.
నిషిమురా మూడవ ఆవిష్కరణ..
జపనీస్ ఖగోళ శాస్త్రవేత్త నిషిమురాచే కనుగొన్న ఖగోళ అద్భుతాల్లో ఇది మూడవది. ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త అయిన నిషిమురా.. అనేక అంశాలపై పరిశోధనలు జరిపారు. ఆయన ప్రకారం.. నిషిమురా తోకచుక్క చాలా ప్రత్యేకమైనది. టెలిస్కోప్ కనిపెట్టడానికి ముందు, ఇది దాదాపు 430 సంవత్సరాల క్రితం భూమి చుట్టూ తిరిగేది. మరోసారి అది భూమిని సమీపించాలంటే.. మళ్లీ 430 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..