Amazon Sale 2023: హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. టాప్ మోడళ్లు.. సూపర్ ఫీచర్లు.. మిస్ చేసుకోవద్దు..

మీరు ఒకవేళ మంచి ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే మీకో గుడ్ న్యూస్. టాప్ టెక్ బ్రాండ్ అయిన హెచ్‌పీ కంపెనీ నుంచి 8జీబీ ర్యామ్ కలిగిన ల్యాప్‌టాప్‌లపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇంత కన్నా మంచి అవకాశం మీకు రాదు. 8జీబీ ర్యామ్ తో పాటు ఐ5 ప్రాసెసర్ కలిగిన ల్యాప్‌టాప్ లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది.

Amazon Sale 2023: హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లపై అదిరే ఆఫర్లు.. టాప్ మోడళ్లు.. సూపర్ ఫీచర్లు.. మిస్ చేసుకోవద్దు..
Hp Laptop 14 Dv2053tu
Follow us
Madhu

|

Updated on: Sep 12, 2023 | 12:44 PM

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది వరకూ ల్యాప్‌టాప్ అంటే అది కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే అనే భావన అందరిలోనూ ఉండేది. అయితే పరిస్థితులు మారాయి. కరోనా పుణ్యమాని చదువులు కూడా డిజిటల్ బాట పట్టాయి. దీంతో స్కూల్ వయసులోనే విద్యార్థులకు ట్యాబ్లెట్ గానీ, ల్యాప్‌టాప్ గానీ కొని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మీరు ఒకవేళ మంచి ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లు అయితే మీకో గుడ్ న్యూస్. టాప్ టెక్ బ్రాండ్ అయిన హెచ్‌పీ కంపెనీ నుంచి 8జీబీ ర్యామ్ కలిగిన ల్యాప్‌టాప్‌లపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇంత కన్నా మంచి అవకాశం మీకు రాదు. 8జీబీ ర్యామ్ తో పాటు ఐ5 ప్రాసెసర్ కలిగిన ల్యాప్‌టాప్ లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ సేల్ 2023 పేరిట తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్లు ఏంటి? ఏయే ల్యాప్ టాప్ మోడళ్లపై ఈ ఆఫర్లు ఉంటాయి. తెలుసుకుందాం రండి..

హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15ఎస్ ఎఫ్ఆర్4000టీయూ.. 8జీబీ ర్యామ్ కలిగిన బెస్ట్ ల్యాప్‌టాప్ ఇది. అత్యాధిక బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది. 15అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే1920*1080 రిజల్యూషన్ తో వస్తుంది. యాంటీ గ్లేర్ ఫీచర్ మీ కళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీని అసలు ధర రూ. 60,599 కాగా అమెజాన్ ప్రత్యేక సేల్ సందర్భంగా రూ. 52,290కే లభ్యమవుతోంది.

హెచ్‌పీ ల్యాప్‌టాప్ 14ఎస్, డీక్యూ5007టీయూ.. ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ లో మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ వ్యూ అందిస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది వస్తుంది. ఇది చూడటానికి స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తుంది. సాధారణ సిల్వర్ కలర్ లో ఇది ఉంటుంది. లైట్ గేమింగ్ కూడా సరిపోతుంది. దీని వాస్తవ ధర రూ. 71,641 కాగా అమెజాన్ ప్రత్యేక సేల్ లో దీనిని రూ. 55,990కే సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15ఎస్, ఎఫ్ క్యూ111టీయూ.. బెస్ట్ హెచ్‌పీ ల్యాప్‌టాప్ లలో ఇది కూడా ఒకటి. 10 కోర్స్, 12థ్రెడ్స్ తో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఫుల్ హెచ్ డీ, మైక్రో ఎడ్జ్ డిస్ ప్లే, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఉంటుంది. డిజైన్ కూడా స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉంటుంది. బడ్జెట్ లెవెల్లో మల్టీ టాస్కింగ్ బాగా ఉపయోగపడే ల్యాప్ టాప్ ఇది. దీని అసలు ధర రూ. 67,832కాగా, అమెజాన్ ఆఫర్లో రూ. 54,990గా ఉంటుంది.

హెచ్‌పీ ల్యాప్‌టాప్ 15 ఎఫ్ డీ0011టీయూ.. ఈ హెచ్‌పీ ల్యాప్‌టాప్ లో అడ్వాన్స్ డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్నాయి. మీ పనిని సులభంగా, వేగంగా చేసేస్తుంది. వీడియో కాలింగ్ చాలా బాగుంటుంది. ఫుల్ హెచ్ డీ కెమెరా ఉంటుంది. దీని వాస్తవ ధర రూ. 72,780 అయితే అమెజాన్ దీనిని రూ. 60,990కే అందిస్తోంది.

హెచ్‌పీ పెవిలియన్ 1414-డీవీ2053టీయూ.. ఇది కూడా హెచ్‌పీ ల్యాప్‌టాప్ లలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అలెక్సా అసిస్టెంట్ ఇందులో ఉంటుంది. సింగిల్ కమాండ్ తో ఇది పనిచేస్తుంది. మూడు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఇది విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా, గృహిణులకు అయినా ఎవరికైనా సరిగ్గా సరిపోతుంది. దీని వాస్తవ ధర రూ. 72,537 కాగా, అమెజాన్ ఆఫర్ లో భాగంగా రూ. 62,490కే లభిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..