China Video Games: ఆన్‌లైన్ గేమ్స్ కట్టడికి చైనా కీలక నిర్ణయం.. ఇకపై వారంలో కేవలం మూడు గంటలే.
China Online Video Games: ఆన్‌లైన్ వీడియో గేట్స్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు పెట్టింది పేరైనా చైనాలో..
China Online Video Games: ఆన్‌లైన్ వీడియో గేట్స్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు పెట్టింది పేరైనా చైనాలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలు నిత్యం వీడియో గేమ్స్ ఆడుతుంటే అది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని భావించిన అక్కడి ప్రభుత్వం వీడియో గేమ్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వారు ఇకపై వారంలో కేవలం మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుకునేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక నుంచి శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ (NPPA) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చైనా ఇలా వీడియో గేమ్స్‌పై నిబంధనలు విధించడం ఇదే తొలిసారి కాదు 2019లో రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకునే అవకాశాన్ని కలిపించింది.
అయితే తాజాగా ఈ సమయాన్ని వారంలో మూడు గంటలకే పరిమితం చేసింది. అంతేకాకుండా గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరి చైనా తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి గేమింగ్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Driving License : మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా?.. ఇలా ఈజీగా మీ ఇంట్లోనే అప్లయ్ చేసుకోండి..