Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China AI: అమెరికాకు సవాలుగా మారిన చైనా డీప్‌సీక్‌.. ప్రపంచాన్నే షేక్‌ చేస్తోంది!

Deepseek: డీప్‌సీక్ చైనాలో ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కంపెనీ. డీప్‌సీక్‌ ఆర్‌1 అనేది చాట్‌జీపీటీ లాంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ టెక్నాలజీ. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేందుకు సహాయపడుతుంది. చాట్‌జీపీటీ లాగే ఆర్‌1 మోడల్‌పై ఇది పనిచేస్తుంది. అంటే 670 బిలియన్‌ పారామీటర్లు..

China AI: అమెరికాకు సవాలుగా మారిన చైనా డీప్‌సీక్‌.. ప్రపంచాన్నే షేక్‌ చేస్తోంది!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 29, 2025 | 11:34 AM

కొన్ని సంవత్సరాల క్రితం వరకు చైనీస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పట్టు సాధించడం ప్రారంభించింది. కానీ అనతికాలంలోనే ప్రపంచం మారిపోయింది. నేడు భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ల నుంచి ఇళ్లకు ఉపయోగించే తాళాల వరకు చైనా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు డీప్‌సీక్ AI మాడ్యూల్‌ను రూపొందించడం ద్వారా చైనా అమెరికా స్టాక్ మార్కెట్‌లో విధ్వంసం సృష్టించింది. ఒక్క స్ట్రోక్‌లో ప్రపంచంలోని టాప్ 500 మంది బిలియనీర్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

ఏమిటీ ‘డీప్‌సీక్‌ ఆర్‌1’?

డీప్‌సీక్ చైనాలో ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కంపెనీ. డీప్‌సీక్‌ ఆర్‌1 అనేది చాట్‌జీపీటీ లాంటి ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ టెక్నాలజీ. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేందుకు సహాయపడుతుంది. చాట్‌జీపీటీ లాగే ఆర్‌1 మోడల్‌పై ఇది పనిచేస్తుంది. అంటే 670 బిలియన్‌ పారామీటర్లు కలిగి ఉన్న అతిపెద్ద లాంగ్వేజ్‌, డాటాను ఇది నిక్షిప్తం చేసుకొని సేవలు అందిస్తుందన్న మాట. ఏ ప్రశ్న అడిగినప్పటికీ సమాధానమివ్వగల సామర్థ్యం దీని సొంతం. అతి తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ ఏఐ మోడల్‌ ఇప్పుడు ఆ ఇండస్ట్రీనే ఆలోచనలో పడేసింది.

డీప్‌సీక్ ఎలా పనిచేస్తుంది..

దీని కార్యకలాపాలు 2023లోనే ప్రారంభమయ్యాయి. కానీ దీని ఏఐ చాట్‌బాట్‌ ఆర్1ను ఈ నెల 10న విడుదల చేశారు. లియాంగ్ వెన్‌ఫెండ్ అనే వ్యక్తి డీప్‌సీక్‌ను ప్రారంభించారు. ఇది చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బోట్ తరహాలో కాకుండా పూర్తి ఉచితంగా ఉపయోగించవచ్చు. పనితీరు ఇతర చాట్‌బోట్‌ల మాదిరిగానే ఉంటుంది. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

ఎన్విడియాకు రూ. 51 లక్షల కోట్ల నష్టం..

చైనాకు చెందిన ఈ డీప్‌సీక్ కంపెనీ ఇప్పటివరకు ఏఐ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా కంపెనీల భవిష్యత్తును దెబ్బతీసింది. వేలాది కోట్ల ఖర్చుతో ఆయా కంపెనీలు ఏఐలో పెట్టుబడులు విరుద్ధంగా డీప్‌సీక్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీ కంపెనీలతో సహా టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలోని టెక్ కంపెనీల షేర్లు భారీగా కుదేలవడమే కాకుండా, అమెరికా స్టాక్ మార్కెట్ నాస్దాక్ 3 శాతానికి పైగా క్షీణించింది. ముఖ్యంగా ఏఐ విభాగంలో శక్తివంతమైన చిప్‌లను తయారు చేసే అమెరికా కంపెనీ ఎన్విడియా మార్కెట్ విలువ ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ఈ మొత్తం మన కరెన్సీలో రూ. 51.92 లక్షల కోట్లు కావడం గమనార్హం. అమెరికా చరిత్రలో ఒక కంపెనీ ఒక్కరోజులోనే ఈ స్థాయి నష్టాన్ని చూడటం ఇదే మొదటిసారి.

స్పందించిన ట్రంప్‌

చైనా డీప్‌సీక్ అతి తక్కువ ఖర్చుతో రూపొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేక్-అప్ కాల్ లాంటిదని, బిలియన్ డాలర్లు ఖర్చు కాకుందా తక్కువ ఖర్చుతో ఇలాంటి చాట్‌బాట్‌లాను తీసుకురావొచ్చన్నారు.