Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sriharikota: రాకెట్‌ ప్రయోగాలు శ్రీహరికోట నుంచే ఎందుకు? ప్రధాన కారణాలు ఇవే!

Sriharikota: రాకెట్స్‌ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట గురించి అందరికి తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పెస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే రాకెట్ల ప్రయోగం కోసం శ్రీహరికోటనే ఎందుకు ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉండగా, ఇక్కడే ఉందుకు?

Sriharikota: రాకెట్‌ ప్రయోగాలు శ్రీహరికోట నుంచే ఎందుకు? ప్రధాన కారణాలు ఇవే!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 29, 2025 | 11:15 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు ఇస్రో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇస్రో తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం ఏపీలోని నెల్లూరులోని శ్రీహరి కోట సతీష్‌ధావన్‌ నుంచి ఉదయం 6.23 గంటలకు GSLV-F15ని నింగిలోకి ప్రయోగించి రికార్డ్‌ సృష్టించింది. అయితే రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరికోటనే ఎందుకు ఎంచుకున్నారన్న సందేహం చాలా మందిలో వస్తుంటుంది. ఇరత ప్రాంతాలు ఉన్నాయి కదా.. అక్కడే ఎందుకు అనేది తెలుసుకుందాం. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోటను రాకెట్‌ ప్రయోగం కోసం ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా శ్రీహరికోట భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అంతేకాదు సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలాగే భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్‌లు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. అందుకే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు తమ రాకెట్‌ ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి.

శ్రీహరికోట చుట్టూ సముద్రం:

ఇంకో విషయం ఏంటంటే శ్రీహరికోట చుట్టూ సముద్రం ఉంటుంది. ఏ కేంద్రం నుంచి అయినా రాకెట్‌ ప్రయోగించినప్పుడు అది సక్సెస్‌ అవుతుందన్న గ్యారంటీ ఉండదు. ప్రయోగం చేపట్టిన తర్వాత అది ఆకాశంలోకి లేచిన తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో రాకెట్‌ జనవాసాల ఇళ్లపై కూలిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల పెద్ద ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంటుంది. శ్రీహరి కోట చుట్టూ సముద్రం ఉన్నందున ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రాకెట్‌ కూలిపోతే సముద్రంలో పడిపోతుంది. దీని వల్ల ఎవ్వరికి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టంగాని సంభవించే ఆస్కారం ఉండదు. అందుకే సముద్రం సమీపంలోనే శ్రీహరికోట ఉండటంతో దీనిని రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా ఎంచుకున్నారు.

ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా..

ఏ ప్రయోగం చేపట్టినా ముందుగా వాతావరణం అనుకూలంగా ఉండాలి. అప్పుడే రాకెట్‌ ప్రయోగం విజయవంతం అవుతుంది. అలాగే రాకెట్‌ ప్రయోగం చేపట్టే ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. అలా ఉన్నా ప్రయోగాలు సక్సెస్‌ కాలేవు. అంతేకాదు ఎండలు కూడా ఎక్కువగా ఉండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు గానీ, ఎండలు గానీ ఎక్కువ ఉండవు. కేవలం అక్టోబర్‌, నవంబర్‌ నెలలో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా నెలలో తక్కువ వర్షాలే ఉంటాయి. మిగతా పది నెలల్లో ప్రయోగాలకు అనుకూలమే.

ధృఢమైన భూమి:

రాకెట్‌ ప్రయోగం చేపట్టే సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. అలాంటి సమయంలో రాకెట్‌ ప్రయోగం చేపట్టే ప్రాంతం భూమి దృఢంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత దృఢంగా ఉంటుంది. మన భారతదేశంలో రాకెట్‌ ప్రయోగానికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఒక్క శ్రీహరికోట మాత్రమే. చుట్టూ సముద్రం ఉండటం, తక్కువ వర్షపాతం ఉండటం, ఎండలు ఎక్కవగా ఉండకపోవడం, బలమైన భూమి ఉండటం ప్రధాన కారణాలు. శ్రీహరికోటలాగా మన దేశంలో మరొక ప్రదేశం లేదు.

మొదట కేరళలో ఏర్పాటు:

నిజానికి అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ముందుగా కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందని భావించారు. ముందుగా ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ.. తర్వాత పూర్తి స్థాయిలో రాకెట నిర్మాణం కేంద్రంగా మారింది. ఇప్పుడు అక్కడ ఎలాంటి ప్రయోగాలు చేపట్టరు. కేవలం రాకెట్‌ నిర్మాణం కోసం మాత్రమే పనులు జరుగుతాయి. ఇదండీ.. శ్రీహరికోటను రాకెట్‌ ప్రయోగశాలగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు.

అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం:

ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్‌లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. రాకెట్‌ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ అన్నిసార్లూ ఉండకపోవచ్చు. సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది. కానీ, శ్రీహరికోటకు చుట్టూ సముద్రమే ఉంది. అందువల్ల అనుకోని కారణాలతో ప్రయోగం విఫలమై రాకెట్ కూలినా సముద్రంలో పడేందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది.

రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్‌, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.  రాకెట్‌ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ.. తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి