BSNL Prepaid: రూ. 48 రీచార్జ్‌‌తో 30 రోజల పాటు కాలింగ్‌, డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరే ప్లాన్‌..

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి ప్రముఖ టెలికం నెట్‌వర్క్ ప్రొవైడర్లతో పోల్చినప్పుడు వినియోగదారు బేస్ తక్కువగా కనిపించినప్పటికీ, ప్లాన్ల టారిఫ్‌ విషయంలో చాలా అనువైన ధరలోనే అందిస్తుంది. ఒకవేళ మీరు కూడా తక్కువ ధరలో మంచి ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ కావలనుకుంటే వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్‌ వారి ఈ ప్లాన్‌ ను పరిశీలించండి. ఇది కేవలం రూ. 50లోపు ధరలోనే వస్తుంది.

BSNL Prepaid: రూ. 48 రీచార్జ్‌‌తో 30 రోజల పాటు కాలింగ్‌, డేటా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అదిరే ప్లాన్‌..
BSNL
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 23, 2023 | 5:41 PM

మన దేశంలో టెలికం రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తు‍న్న సంస్థలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌ టెల్‌. అత్యధిక కస్టమర్‌ సపోర్టుతో పాటు మంచి నాణ్యమైన సేవలను అందిస్తుంటాయి. అయితే వాటి ప్లాన్ల రేటులు కాస్త ఎక్కువగానే ఉంటుంటాయి. అయితే తక్కువ ధరలో మంచి ప్లాన్లు కావాలంటే మాత్రం ప్రభుత్వం మద్దతు నడిచే బీఎస్‌ఎన్‌ఎల్‌ బెస్ట్‌. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఈ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమెటడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని సేవలను అధికంగా వినియోగించుకుంటున్నారు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి ప్రముఖ టెలికం నెట్‌వర్క్ ప్రొవైడర్లతో పోల్చినప్పుడు వినియోగదారు బేస్ తక్కువగా కనిపించినప్పటికీ, ప్లాన్ల టారిఫ్‌ విషయంలో చాలా అనువైన ధరలోనే అందిస్తుంది. ఒకవేళ మీరు కూడా తక్కువ ధరలో మంచి ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ కావలనుకుంటే వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్‌ వారి ఈ ప్లాన్‌ ను పరిశీలించండి. ఇది కేవలం రూ. 50లోపు ధరలోనే వస్తుంది. దీనిలో డేటాతో పాటు కాలింగ్‌ అవసరాలకు కూడా తీరిపోతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ రూ. 48..

ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త పాకెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ ధరను ప్రకటించింది. కేవలం రూ. 48తోనే ఇది లభిస్తోంది. ఈ ప్యాక్‌లో వినియోగదారులకు కనీస డేటా కాలింగ్ అవసరాలు తీరుతాయి. తక్కువ ఖర్చుతో నెల రోజుల మొబైల్ సేవను కోరుకునే వారికి ఈ ప్లాన్ చాలా అనుకూలంగా ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.48 ప్లాన్ ప్రయోజనాలు..

వ్యాలిడిటీ: రూ. 48 ధరతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్ తీసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది వినియోగదారులకు అంతరాయం లేని సేవను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

టాక్‌టైమ్ బ్యాలెన్స్: కస్టమర్‌లు రూ. 10 టాక్‌టైమ్ బ్యాలెన్స్ పొందుతారు, దీనిని కాల్‌లు చేయడానికి ఉపయోగించవచ్చు.

డేటా వినియోగం: ప్లాన్ ప్రాథమిక డేటా కనెక్టివిటీని అందిస్తూ నిమిషానికి 20 పైసల చొప్పున ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది.

ఇది అవసరం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 48 ప్లాన్‌ ను తీసుకుని పూర్తి 30 రోజుల వ్యాలిడిటీని పొందాలంటే అంతకు ముందు తప్పనిసరిగా బీఎస్ఎన్ఎల్ నుండి రూ. 48 ప్లాన్‌ను పొందేందుకు, వినియోగదారులు ఏదైనా యాక్టివ్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ ఇప్పటికే ఉండి ఉండాలి. అప్పుడు పూర్తి 30 రోజుల చెల్లుబాటును పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని చోట్లా లేదు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్‌తో సహా నిర్దిష్ట సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. వినియోగదారులు వారి సంబంధిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న తదుపరి ప్లాన్ సమాచారం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సంస్థ సూచించింది.

ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాన్‌ సరిగ్గా సరిపోతుంది. కేవలం కాలింగ్‌ తో పాటు తక్కువ డేటా వినియోగం ఉన్నవారికి ఇది బాగా సూట్‌ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..