Flying Car: కారుకే రెక్కలు వస్తే.. పక్షిలా ఎగిరే వినూత్న కారును తయారు చేసిన ‘ఫ్రాక్టిల్’..
Flying Car: సాంకేతికాభివృద్ధిలో ప్రపంచ దేశాలు దూసుకుపోతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ సాంకేతిక ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయి.
Flying Car: సాంకేతికాభివృద్ధిలో ప్రపంచ దేశాలు దూసుకుపోతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ సాంకేతిక ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయి. ప్రజల ఆలోచనా విధానాల్లోనూ అనేక మార్పులు వస్తున్నాయి. పెరుగుతున్న జనాబాకు తగ్గట్లుగా ప్రపంచ వ్యాప్తంగా వాహనాల వినియోగం కూడా పెరుగిపోతుంది. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతోంది. ఈ క్రమంలోనే ఎగిరే కార్ల గురించి పలు సందర్భంగా గ్రాఫిక్ డిజైన్లు, అంచనాలు, డెమోలకు సంబంధించి వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఎగిరే కారు.. ఇక కల కాదు. ఇక ఆ కారులో ఎంచక్కా ఎగురుతూ ప్రయాణించవచ్చు. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ పక్షి ఆకారంతో వినూత్నంగా ఎగిరే కారును డిజైన్ చేసింది. ఇలాంటి కార్లను వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికిల్స్ అంటారట. ఎందుకంటే.. ఇవీ నిట్టనిలువునా పైకి ఎగిరిపోతాయట. అయితే, గతంలో ఉన్న వీటీఓఎల్‌నే మార్చినియర్ వీటీఓఎల్‌గా కొత్త విమానాలకు పేరు పెట్టింది ఫ్రాక్టిల్ సంస్థ. ఎలాగైతే, పక్షి తన కాళ్లతో చెట్టుకొమ్మను పట్టుకుంటుందో.. ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగిరే పక్షి మాదిరిగానే ఇది కూడా పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి.
ఫ్రాక్టిల్ తయారు చేసిన ఈ రెక్కల వాహనం పూర్తిగా విద్యుత్ సాయంతో నడుస్తుంది. ఇందులో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్‌వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకుండానే, పైలట్ మోడ్‌తోపాటు రిమోట్ కంట్రోల్ సాయంతోనూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లటానికి వీలుగా ఉంటుందని ఫ్రాక్టిల్ సంస్థ తెలిపింది.
Also read:
Children Fear: కొత్తవారంటే పిల్లలు ఎందుకు భయపడుతుంటారు..? చైల్డ్ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారంటే..!
Kishmish Benefits: ఎండుద్రాక్షతో అదిరిపోయే బెనిఫిట్స్.. ఆ విషయంలో పిల్లలకు ఎంతో ఉపయోగం..!