Best Laptops: స్టూడెంట్స్‌కు ఇవే స్పెషల్ ల్యాప్‌టాప్స్.. ధర, ఫీచర్లల్లో వీటిని మించినవి లేవంతే..!

చాలా కంపెనీలు స్టూడెంట్స్ వెర్షన్స్ అంటూ కొన్ని ల్యాప్ టాప్ లను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. వీటిల్లో ఏల్యాప్ టాప్ మంచి ఫీచర్లతో తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయో? తెలుసుకోవడం కష్టం.

Best Laptops: స్టూడెంట్స్‌కు ఇవే స్పెషల్ ల్యాప్‌టాప్స్.. ధర, ఫీచర్లల్లో వీటిని మించినవి లేవంతే..!
Laptop Market Delhi
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 6:01 PM

ప్రస్తుతం విద్యలో సాంకేతిక అవసరం చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా కళాశాల విద్యలో ల్యాప్ టాప్ లేనిదే చదువుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కరోనా తర్వాత ఆన్ లైన్ క్లాసుల ట్రెండ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ అవసరాన్ని దృష్టి చాలా కంపెనీలు స్టూడెంట్స్ వెర్షన్స్ అంటూ కొన్ని ల్యాప్ టాప్ లను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. వీటిల్లో ఏల్యాప్ టాప్ మంచి ఫీచర్లతో తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయో? తెలుసుకోవడం కష్టం. కొంతమంది బడ్జెట్ తో సంబంధం లేకుండా బ్రాండెడ్ ల్యాప్ టాప్ లను ఇష్టపడతారు. మరికొంత మంది బడ్జెట్ లో ఉండే ల్యాప్ టాప్ లు కావాలని అనుకుంటుంటారు. అలాగే రంగు, డిజైన్, బరువు వంటి వాటిని కచ్చితంగా ల్యాప్ టాప్ కొనే సమయంలో చూసుకోవాలి. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు అధిక ఫీచర్లు ఉన్న ఐదు బెస్ట్ ల్యాప్ టాప్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

హెచ్ పీ 15 ఎస్ 

హెచ్ పీ 15 ఎస్ ల్యాప్ టాప్ విద్యార్థులక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. మీరు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే కోర్సు పూర్తయ్యే వరకూ ఎలాంటి సమస్య లేకుండా పని చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐ 3 ప్రాసెసర్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ పరిమాణం  15.6 అంగుళాలు. లాంగ్ బ్యాటరీ లైఫ్ తో పాటు యూజర్ ఫ్రెండ్లీ కీబోర్డు, అవసరమైన పోర్టులతో వినియోగదాారులను ఆకట్టుకుంటుంది. ఈ సూపర్ ల్యాప్ టాప్ ధర రూ.43, 018. ఇది ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది. 

అసస్ వివో బుక్ (2021)

ఈ ల్యాప్ టాప్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. 4 జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ స్క్రీన్ సైజ్ 15.6 అంగుళాలు. అలాగే 6 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంటుంది. 1366X768 స్క్రీన్ రెజుల్యూషన్ తో ఆకట్టుకునే విధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.25990.

ఇవి కూడా చదవండి

ఏసర్ అస్పైర్ 5

ఏసర్ అస్పైర్ 5 ల్యాప్ టాప్ లుక్స్ పరంగా విద్యార్థులను అమితంగా ఆకట్టకుంటుంది. ముఖ్యంగా క్లాస్ లకు పట్టుకెళ్లడానికి అనుకూలంగా లో వెయిట్ తో వస్తుంది. అలాగే ఇందులో ఉండే వెబ్ క్యామ్ ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ల్యాప్ టాప్ ను బ్లూ టూత్, వైఫై తో సులభంగా కనెక్ట్ చేయవచ్చు. అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ తో అదనంగా పని చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.52,000 గా ఉంది. 

లెనోవో ఐడియల్ ప్యాడ్ స్లిమ్

ల్యాప్ టాప్ ను వాడే సమయంలో కళ్లను కాపాడుకోడానికి యాంటీ గ్లార్ స్క్రీన్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 8 జీబీ ర్యామ్ తో వచ్చే ఈ ల్యాప్ టాప్ హైస్పీడ్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దాదాపు గంటలో 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది. బ్లూటూత్ 5.0 వెర్షన్ తో వేగవంతమైన కనెక్టవిటీ ఈ ల్యాప్ టాప్ సొంతం. ఈ ల్యాప్ టాప్ ధర మాత్రం రూ.36,990

యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 2020

మీరు యాపిల్ లవర్స్ అయితే ఈ ల్యాప్ టాప్ మంచి ఆప్షన్. అద్భుతమైన రెటినా డిస్ ప్లే, సూపర్ బ్యాటరీ తో, అలాగే మ్యాక్ ఓఎస్ తో ఈ ల్యాప్ టాప్ పని చేస్తుంది. దీని ధర రూ.86, 900.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి