- Telugu News Photo Gallery Technology photos Are you searching for buy a new laptop here some best laptops under 30 k
Best Laptops: వర్క్ ఫ్రమ్ హోమ్ వేళ.. కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.? రూ. 30 వేల లోపు బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
Best Laptops: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి వస్తోంది. దీంతో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. మరి రూ. 30 వేల లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న కొన్ని ల్యాప్‌ట్యాప్స్‌ల వివరాలు తెలుసుకుందామా.?
Updated on: Jan 07, 2022 | 4:05 PM

కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌ల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. ఈ విధానం ఇంకా కొన్ని నెలలపాటు కొనసాగక తప్పని పరిస్థితిలో కొత్త ల్యాప్‌టాప్ కొనాలని భావిస్తున్నారా.? అయితే రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్ష్ మీకోసం..

HP Chromebook 11a: ఈ ల్యాప్‌టాప్ రూ. 25,475కి అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో AMD A4-9120C APU డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 11.6 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే ఈ ల్యాప్‌టాప్ సొంతం. ఇక ఇందులో 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. 45w ఛార్జింగ్ సపోర్ట్ చేసే 47 wh బ్యాటరీని ఇచ్చారు.

Lenovo Chromebook 14e: తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో లెనెవో క్రోమ్‌బుక్ ఒకటి. ఇది రూ. 24,990గా ఉంది. ఇందులో వాటర్ రెసిస్ట్ కీబోర్డ్‌ను అందించారు. ఇక AMD A30115Ce ప్రాసెసర్‌ను ఇచ్చారు. 14 ఇంచెస్ FHD డిస్‌ప్లేను అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 10 గంటల పాటు నాన్‌స్టాప్‌గా నడుస్తుంది.

HP Chromebook MediaTek MT8183: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ రూ. 23,490కి అందుబాటులో ఉంది. ఇందులో మీడియా టెక్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 11.6 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇచ్చారు. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్ 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది.

Asus Chromebook Flip: బడ్జెట్‌లో టచ్ స్క్రీన్‌తో కూడిన ఈ ల్యాప్‌టాప్స్‌లో అసూస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ ఒకటి. ఇందులో 350 డిగ్రీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్ క్లెరోన్ ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ 10 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

Acer Chromebook 311 C733-C5A: ఈ ల్యాప్‌టాప్ రూ. 23,990కి అందుబాటులో ఉంది. ఇందులో క్లెరోన్ డ్యూయల్ కోర్ N4020 ప్రాసెసర్‌ను అందించారు. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. 11.6 ఇంచెస్ డిస్‌ప్లేతో కూడిన ఈ ల్యాపీలో ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 600ని ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 12.5 గంటల బ్యాటరీ బ్యాకప్ దీని సొంతం.

Lenovo IdeaPad 3 11 Chromebook: రూ. 24,090కి అందుబాటులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ క్లెరోన్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. తక్కువ బరువుతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 10 గంటలు బ్యాకప్ ఇస్తుంది.

HP Chromebook: హెచ్‌పీ క్రోమ్‌బుక్ రూ. 27,490కి అందుబాటులో ఉంది. ఇది ఇంటెల్ క్లెరోన్ N4020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే క్రోమ్‌బుక్ సొంతం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో తయారు చేసిన క్రోమ్‌బుక్‌లో యూజర్లకు 100 జీబీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ అందిస్తారు.

Asus Chromebook C223: రూ. 23,966కి అందుబాటులో ఉన్న అసూస్ క్రోమ్‌బుక్ సీ223 ల్యాప్‌టాప్‌లో 11.6 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇంటెల్ యూడీహెచ్ గ్రాఫిక్ కార్డ్ దీని సొంతం. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ల్యాప్‌టాప్‌లో 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ కోర్ క్లెరోన్ N3350 ప్రాసెసర్‌ను ఇచ్చారు.




