Budget 5G Phone: అతి తక్కువ ధరలో శామ్‌సంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ అదుర్స్.. ధర చాలా చీప్..
శామ్‌సంగ్ కంపెనీ విడుదల చేసిన గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సిరీస్‌లోని ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగానే అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్..

శామ్‌సంగ్ కంపెనీ విడుదల చేసిన గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సిరీస్‌లోని ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగానే అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్.. భారతదేశంలో తన M సిరీస్‌లో కొత్త Samsung Galaxy M14 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ శుక్రవారం నుండి మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. అతి ధక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ లైఫ్, ప్రాసెసర్, కెమెరా, అన్నీ అదుర్స్ అనిపిస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఇస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ సహా వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.
ధర, ఫీచర్స్ మరిన్ని వివరాలు..
Samsung Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదలైంది. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 13,490 గా ఉంది. 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,990 గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో సేల్‌కి ఉంది. ఏప్రిల్ 21 నుండి రిటైల్ స్టోర్‌లలోనూ అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ M14 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల పూర్తి HD PLS LCD డిస్‌ప్లేను 2408×1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది.




కెమెరా విషయానికి వస్తే.. Samsung Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్, రెండవ కెమెరా 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, మూడవ కెమెరా 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కలిగి ఉంది. ఇది కాకుండా, 13 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైలైట్ 6000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇది టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే, 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC, GPS కనెక్టివిటీ వంటి సూపర్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..