Auto Tips: కారును ఆపడానికి ముందుగా క్లచ్ లేదా బ్రేక్ ఏది నొక్కాలి? మరెన్నో ట్రిక్స్‌!

నేడు చాలా మంది తమ ఇంట్లో కారు ఉండడం సర్వసాధారణం. కానీ చాలా మందికి కారు నడుపుతున్నప్పుడు క్లచ్, బ్రేకుల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. కొత్త కొత్తగా నేర్చుకున్న వారికి కొంత కన్ఫిజన్‌ ఉంటుంది. వారిలో అనేక గందరగోళాలు ఉంటాయి. వాహనం పార్క్ చేయడానికి సరైన మార్గం ఏమిటి? అంటే కారును ఆపేటప్పుడు..

Auto Tips: కారును ఆపడానికి ముందుగా క్లచ్ లేదా బ్రేక్ ఏది నొక్కాలి? మరెన్నో ట్రిక్స్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 08, 2024 | 1:45 PM

నేడు చాలా మంది తమ ఇంట్లో కారు ఉండడం సర్వసాధారణం. కానీ చాలా మందికి కారు నడుపుతున్నప్పుడు క్లచ్, బ్రేకుల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. కొత్త కొత్తగా నేర్చుకున్న వారికి కొంత కన్ఫిజన్‌ ఉంటుంది. వారిలో అనేక గందరగోళాలు ఉంటాయి. వాహనం పార్క్ చేయడానికి సరైన మార్గం ఏమిటి? అంటే కారును ఆపేటప్పుడు ముందుగా క్లచ్ లేదా బ్రేక్ ఏది నొక్కాలి అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇది తెలుసుకుంటే మీ వాహనం జీవితకాలం కూడా పెరుగుతుంది.

  1. నెమ్మదిగా ఉంటే ముందుగా క్లచ్ నొక్కండి: మీ వాహనం వేగం తక్కువగా ఉంటే, మీరు ముందుగా క్లచ్‌ని నొక్కి, ఆపై బ్రేక్‌ని ఉపయోగించాలి. దీంతో ఇంజిన్‌ ఆఫ్‌ కాకుండా వాహనానికి ఇబ్బంది లేకుండా నెమ్మదిగా ఆగుతుంది.
  2. అధిక వేగంతో బ్రేక్: మీ కారు వేగంగా కదులుతున్నట్లయితే కారుని స్లో చేయడానికి ముందుగా బ్రేక్‌ని నొక్కి, ఆపై క్లచ్‌ని ఉపయోగించండి. ఆపై ఇంజిన్ వేగం, వాహనం వేగం సమానంగా ఉంటాయి. ఇది మీ పెట్రోల్‌ను ఆదా చేస్తుంది. అలాగే వాహనం లైఫ్‌ను కూడా పొడిగించవచ్చు.
  3. ఇంజిన్ బ్రేకింగ్ ఉపయోగాలు: రహదారి ఖాళీగా ఉన్నప్పుడు మీరు వేగాన్ని తగ్గించాలనుకుంటే గేర్‌ని ఉపయోగించండి. అంటే 4వ గేర్ నుండి 3వ గేర్‌కి మార్చి వేగాన్ని తగ్గించండి. దీనిని ఇంజిన్ బ్రేకింగ్ అంటారు. ఇది ఇంధన వినియోగాన్ని కూడా తగ్గిస్తుందంటున్నారు టెక్‌ నిపుణులు.
  4. ఈ పద్ధతుల ద్వారా కారు మైలేజీని పెంచవచ్చు: మీరు మీ కారు మైలేజ్‌పై శ్రద్ధ వహిస్తుంటే, మీ కారు మైలేజీని ఎలా పెంచాలో తెలియకపోతే కొన్ని ట్రిక్స్‌ను ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు. నెమ్మదిగా వేగవంతం చేయండి. నెమ్మదిగా బ్రేక్ చేయండి. వేగంగా నడపడం, అకస్మిక బ్రేకింగ్ కారణంగా ఇంధన వినియోగం పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వేగ పరిమితులను గమనించండి: కారును ఎల్లప్పుడూ మితమైన వేగంతో (40-60 కిమీ/గం) నడపండి. చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా నడపడం వల్ల ఎక్కువ ఇంధనం వినియోగమవుతుంది.
  7. ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచవద్దు: ట్రాఫిక్ సిగ్నల్ లేదా జామ్ సమయంలో వాహనం ఎక్కువసేపు ఆగి ఉంటే ఇంజిన్‌ను ఆఫ్ చేయండి. దీనివల్ల ఇంధనం వృథా కాదు.
  8. సరైన గేర్‌లో డ్రైవ్ చేయండి: తక్కువ గేర్‌లో డ్రైవింగ్ చేయడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది ఇంధన వినియోగం పెరుగుతుంది. అధిక గేర్‌లో నడపడం వల్ల మైలేజీ మెరుగుపడుతుంది.
  9. సరైన టైర్లు: కారు టైర్లలో సరైన గాలి ఉండటం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ఎయిర్‌ చెక్‌ చేసుకోండి. గాలి తక్కువగా ఉన్నప్పుడు కారుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది.
  10. ఏసీ వినియోగం: అధిక ఏసీ వినియోగం ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. అవసరం లేనప్పుడు ఏసీ ఆఫ్ చేయండి. అలాగే వాహనంలో అదనపు లగేజీని తీసుకువెళ్లడం వల్ల దాని బరువు పెరుగుతుంది. అందుకే ఇంజన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!