
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. క్రమేపి స్మార్ట్‌ఫోన్ సాయంతో వాడే ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వాడకం కూడా అదే స్థాయిలో ఉంది. వీటిల్లో ముఖ్యంగా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు అధికంగా వాడుతున్నారు. గతంలో వాచ్ అంటే కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే వాడేవారు కానీ ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే విధంగా స్మార్ట్‌వాచ్ అధికంగా వాడుతున్నారు. వీటిల్లో ఆరోగ్య సంబంధిత ఫీచర్లు కూడా మిళితమై ఉండడంతో ఎక్కువ మంది వాడడానికి ఇష్టపడుతున్నారు. సహజంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాపిల్ కంపెనీ స్మార్ట్ వాచ్‌ల రంగంలో తన హవా చూపుతుంది. ఇతర కంపెనీల వాచ్‌లతో పోల్చుకుంటే యాపిల్ రియల్‌టైమ్ డేటాను అందించడంతో ముందుంది. తాజాగా ఓ గర్భిణి ప్రాణాలను యాపిల్ వాచ్ కాపాడింది. వినడానికి వింతగా ఇది నిజమే. గర్భిణి ప్రాణాలను యాపిల్ వాచ్ ఎలా కాపాడిందనే విషయాన్ని ఓ సారి తెలుసుకుందాం.
స్మార్ట్‌వాచ్‌లో ఉండే ఫిట్‌నెస్ ట్రాకర్లు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యపరమైన పరిమితులను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా యూజర్లకు వారి ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలను పంపడంలో బాగా పని చేస్తున్నాయి. ఈ హెచ్చరికలను ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గతేడాది చివర్లో వెరోనికా విలియమ్స్ గర్భిణిగా ఉన్నప్పుడు యాపిల్ ఆమెకు అధిక హృదయ స్పందన రేటు గురించి తెలియజేసింది. ఊపిరి పీల్చుకున్నప్పుడు విలియమ్స్ అనేక హెచ్చరికల తర్వాత ఆమె వైద్యుడిని సంప్రదించింది. దీంతో ఆయన ఆమె పరిస్థితిని తెలుసుకుని ఆమెకు అత్యవసర సి-సెక్షన్ అవసరమని వెంటనే గుర్తించి ఆ మేరకు ట్రీట్‌మెంట్ ప్రారంభించారు. ఆ చికిత్సలో ఆమెకు వయో కార్డిటిస్, గుండె కండరాల వాపును కూడా గమనించారు. ఆమె రోగ నిరోధక శక్తి ఆమె గుండె కణజాలంపై దాడి చేయడం ప్రారంభించింది.
వయోకార్డిటిస్ వల్ల ఆమె నెల రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అయితే వైద్యులు మాత్రం బాధితురాలు యాపిల్ వాచ్ నోటిఫికేషన్ ప్రకారం వైద్యానికి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం విలియమ్స్ ఆమె బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సాధారణంగా యాపిల్ వాచ్‌లు సిరీస్ 1 నుంచి నిజ-సమయ హృదయ స్పందన రేటును ట్రాక్ చేయడంలో గొప్పగా పని చేస్తున్నాయి. అసాధారణమైన హృదయ స్పందన రేటుతో పాటు తక్కువ హృదయ స్పందన రేటు వచ్చిన సమయంలో నోటిఫికేషన్‌ల ద్వారా యాపిల్ వాచ్‌లు వినియోగదారులను అలెర్ట్ చేస్తాయి. అలాగే తదుపరి పరీక్షల కోసం వైద్య సంరక్షణ కోసం వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..