Apple Watch: సెకండ్ హ్యాండ్ యాపిల్ వాచ్ కొనాలని చూస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..
తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రజలందరూ వీటిపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే, మార్కెట్‌లోకి ఎన్ని బ్రాండ్స్ వచ్చినప్పటికీ.. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లకు ఉండే బ్రాండే వేరు. యాపిల్ వాచ్‌లకు మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం ఉంది. అయితే, అధిక ధర కారణంగా.. వాటిని కొనేందుకు భయపడుతుంటారు. మరికొందరు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ యాపిల్...

గత కొన్నేళ్లుగా స్మార్ట్‌వాచ్‌లు ట్రెండ్‌గా మారాయి. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరూ సాధారణ వాచ్ కాకుండా స్మార్ట్ వాచ్ ధరించడానికి ఇష్టపడుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు తమ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రజలందరూ వీటిపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే, మార్కెట్‌లోకి ఎన్ని బ్రాండ్స్ వచ్చినప్పటికీ.. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లకు ఉండే బ్రాండే వేరు. యాపిల్ వాచ్‌లకు మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం ఉంది. అయితే, అధిక ధర కారణంగా.. వాటిని కొనేందుకు భయపడుతుంటారు. మరికొందరు సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేస్తారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ యాపిల్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. తక్కువ ధరకే అనేక ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, సెకండ్ హ్యాండ్ యాపిల్ వాచ్‌లను కొనే ముందు యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవి యాపిల్ వాచ్‌కే కాదు.. ఇతర వాచ్‌లు కొనుగోలు చేసినా కూడా వీటిని పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ తప్పక గుర్తుంచుకోవాలి..
1. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసే ముందు తప్పకుండా ఆ స్మార్ట్ వాచ్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేయాలి. అది దాదాపు 80 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉండాలి. బ్యాటరీ ఛార్జ్ శాతం తక్కువగా ఉంటే ఆ బ్యాటరీ బ్యాకప్ సరిగా లేదని అర్థం.
2. బ్యాటరీ పరిస్థితిని చెక్ చేయడానికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి, బ్యాటరీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అలా దాన్ని చెక్ చేయాలి.
3. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే ముందుగా ఆ వాచ్‌కు సంబంధించిన బిల్లు ప్రతిని చెక్ చేయాలి.
4. బిల్లు ప్రతి మాత్రమే కాకుండా బాక్స్, దానిపై ఉన్న సిరీస్ నెంబర్, ఇతర వివరాలను కూడా చెక్ చేయాలి.
5. ఈ నెంబర్ ఆధారంగా మీరు కొనుగోలు చేస్తున్న స్మార్ట్ వాచ్ వివరాలను తెలుసుకోవచ్చు.
6. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌వాచ్‌లను తెలిసిన వ్యక్తులు, ధృవీకరించబడిన ప్రదేశాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.
7. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సెకండ్‌హ్యాండ్ స్మార్ట్‌వాచ్‌లను విక్రయిస్తోంది. స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలనుకునే వారు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు.
8. కొన్ని షాపుల్లోనూ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ వాచ్‌లు లభిస్తాయి.
2023లో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన Apple స్మార్ట్‌వాచ్ ఏది?
మధ్య-శ్రేణి ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే Apple Watch SE, Apple Watch Series 5ని కొనుగోలు చేయవచ్చు. ఇవి పాతవైనప్పటికీ.. అన్ని ఫీచర్లు ఉన్నాయి. కానీ, వాటిపై 50% వరకు తగ్గింపు పొందవచ్చకు. ఈ రెండు యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలలో అన్ని సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. హెల్త్‌కు సంబంధించిన అనేక ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు తప్పకుండా పైన పేర్కొన్న అంశాలను గమనించాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




