- Telugu News Photo Gallery Technology photos Apple launching new smart watch 2024 Apple watch with BP Monitoring feature
2024 Apple watch: యాపిల్ నుంచి కొత్త వాచ్.. బీపీ మానిటరింగ్‌తో పాటు మరెన్నో..
యాపిల్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే చాలు టెక్ మార్కెట్లో బజ్ ఉంటుంది. ఐఫోన్ మొదలు వాచ్‌ల వరకు యాపిల్ ప్రొడక్ట్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ నుంచి మరో కొత్త వాచ్ లాంచ్ అయింది. 2024 యాపిల్ వాచ్ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 04, 2023 | 2:48 PM

యాపిల్ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ విడుదలైంది. 2024 యాపిల్ వాచ్ పేరుతో ఈ కొత్త వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు.

2024 యాపిల్ వాచ్‌లో బీపీ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్ ఈ వాచ్ సొంతం. అయితే ఇప్పటికే బీపీ మానిటరింగ్ వంటి ఫీచర్లు వాచ్‌లలో ఉన్నా.. కచ్చితత్వంలో కూడిన వివరాలను అందించలేవు. అయితే యాపిల్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన ఫీచర్స్‌ను తీసుకొస్తున్నారు.

ఈ వాచ్‌లోని బీపీ మానిటరింగ్ ఫీచర్‌తో ఇవి మెరుగైన బీపీ మానిటరింగ్ వ్యవస్థను అందించనున్నారు. హైపర్ టెన్షన్ శోధనలో బీపీ సెన్సర్ టెక్‌ను ఈ ఫీచర్‌లో జోడించనున్నారు. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.

బీపీ రీడింగ్స్‌ను కచ్చితత్వంతో తెలపడం వల్ల యూజర్లను యాపిల్ డివైజ్ వెంటనే అలర్ట్ చేసే విధంగా టెక్నాలజీని తీసుకొచ్చారని కంపెనీ చెబుతోంది. స్లీప్ అపెనా డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో నిద్రలేమి వంటి సమస్యలను కూడా పసిగట్టవచ్చు.

2024 స్మార్ట్ వాచ్‌లోని స్లీప్ అప్నియా డిటెన్షన్ ఫీచర్‌తో నిద్రలేమి సమస్యను వెంటనే గుర్తించి, వైద్యుల సలహాలు తీసుకోవాలని యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ యాపిల్ వాచ్ ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.





























