- Telugu News Photo Gallery Technology photos Best 5G smartphones under 20K, Check here for full details Telugu Tech News
Smart Phones: రూ. 20 వేలలో సూపర్ స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ అదుర్స్..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినయోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఫోన్ రీచార్జ్ నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ వరకు అన్ని పనులు స్మార్ట్ ఫోన్‌లోనే చేసే రోజులు వచ్చేశాయ్. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో కూడిన ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. మరి రూ. 20 వేలలో మంచి ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్ ఫోన్‌లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Nov 05, 2023 | 12:41 PM

Moto G84 5G: మోటోరోలా కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 6.55 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం

OnePlus Nord CE3 Lite 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 108 ఎంపీ రెయిర్ కెమెరాతోపాటు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Poco X5 Pro 5G: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో బ్రాండ్.. పోకో ఎక్స్5 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 18,499గా ఉంది. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. ఇందులో 108 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Redmi Note 12 5G: రెడ్‌మీ నోట్ 12 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతోపాటు, 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy M34 5G: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్34 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 16,499 నుంచి అందుబాటలో ఉంది. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.





























