Apple Watch Series 8: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? ఆసక్తికర విషయాలు వెల్లడి
Apple Watch Series 8: యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ సంస్థ వచ్చే ఏడాది(2022) లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పనులను యాపిల్ ఇప్పటికే మొదలుపెట్టింది.
Apple Watch Series 8 Details: యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ సంస్థ వచ్చే ఏడాది(2022) లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పనులను యాపిల్ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇందులో ఉన్న ప్రధాన ప్రత్యేకత ఏంటన్న అంశంపై టెక్ మీడియా వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలయ్యింది. సిరీస్ 8 ప్రత్యేకతలకు సంబంధించిన కొన్ని లీకులు కూడా బయటకు వస్తున్నాయి. యాపిల్ వాచ్ మునుపటి సిరీస్‌లతో పోల్చితే 8 సిరీస్‌లో డిస్ ప్లే సైజు పెద్దదిగా ఉండబోతుందని సమాచారం. మూడు డిస్ ప్లే సైజుల్లో వచ్చే ఏడాది సిరీస్ 8 రానున్నట్లు డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ సీఈవో రోస్ యంగ్ వెల్లడించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయంలో ఉన్న యాపిల్ వాచ్ 7 సిరీస్ రెండు సైజుల్లో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 41 ఎంఎం, ఇంకోటి 45 ఎంఎం డిస్ ప్లే సైజ్‌లో ఉన్నాయి. దీనికి ముందు 6 సిరీస్‌లో ఇవి 40 ఎంఎం, 44 ఎంఎం సైజులో ఉన్నాయి. యాపిల్ వాచ్ సిరీస్ 8 డిస్‌ప్లే సైజ్ 45 ఎంఎం కంటే ఎక్కువగా ఉండొచ్చని రోస్ యంగ్ వెల్లడించారు.
డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ సీఈవో రోస్ యంగ్ ట్వీట్..
Would you like to see a bigger display on Series 8 of the Apple Watch in 2022?
— Ross Young (@DSCCRoss) October 12, 2021
దీనికి తోడు హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్స్ సిరీస్ 8లో ఉండే అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బాడీ ఉష్ణోగ్రతను చూపించే ఫీచర్ ఇందులో ఉంటుంది. అయితే శరీర ఉపరితలంపై ఉష్ణోగ్రతను చూపించడం కాకుండా..మైండ్ ఉష్ణోగ్రతను ఇది చూపించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
మొత్తానికి సరికొత్త హంగులతో వచ్చే ఏడాది రానున్న యాపిల్ వాచ్ సిరీస్ 8పై ఇప్పటి నుంచే గాడ్జెట్స్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. దీని ధర భారత మార్కెట్‌లో ఎంత ఉండొచ్చన్న అంశం కూడా తెలియడం లేదు. వాచ్ సిరీస్ 7 ప్రస్తుతం భారత మార్కెట్‌లో రూ.51వేలకు విక్రయిస్తున్నారు. సిరీస్ 8 దీని కంటే ఎక్కువగానే ఉండే అవకాశముంది.
Also Read..