Apple WWDC 2023: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మ్యాక్‌లను ఆవిష్కరించిన యాపిల్.. పూర్తి వివరాలు ఇవి..
మ్యాక్ స్టూడియో, మ్యాక్ ప్రో పేరిట లాంచ్ అయిన ఈ రెండు మోడళ్లు ఇప్పటి వరకూ ఉన్న అన్ని మ్యాక్ లలో కెల్లా అత్యంత అధిక సామర్థ్యం కలిగినవిగా యాపిల్ సంస్థ ప్రకటించుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2023(WWDC 2023)లో వీటిని పరిచయం చేసింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మ్యాక్ లను యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. మ్యాక్ స్టూడియో, మ్యాక్ ప్రో పేరిట లాంచ్ అయిన ఈ రెండు మోడళ్లు ఇప్పటి వరకూ ఉన్న అన్ని మ్యాక్ లలో కెల్లా అత్యంత అధిక సామర్థ్యం కలిగినవిగా యాపిల్ సంస్థ ప్రకటించుకుంది. అమెరికాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన వార్షిక సమావేశంలో వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2023(WWDC 2023)లో వీటిని పరిచయం చేసింది. ఈ రెండు మోడళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మ్యాక్ స్టూడియో అప్ గ్రేడ్..
మ్యాక్ స్టూడియోను యాపిల్ ఆధునికీకరించింది. ఎం2 మ్యాక్స్, ఎం2 అల్ట్రా చిప్స్ తో అప్ గ్రేడ్ చేసింది. ఇంటెల్ ఆధారిత 27 అంగుళాల ఐమ్యాక్ తో పోలిస్తే తాజా స్టూడియో ఆరు రెట్లు వేగంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఎం1 అల్ట్రా చిప్ మ్యాక్ స్టూడియోతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా ఉంటుందని పేర్కొంది.
- ఎం2 మ్యాక్స్ స్టూడియోలో 12 కోర్ సీపీయూ, 38 కోర్ జీపీయూ, 96జీబీ ర్యామ్ 8టీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది.. 3డీ ఆర్టిస్టులు మోషన్ గ్రాఫిక్స్ వంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 50శాతం వేగంగా చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఎక్స్ కోడ్ తో చేసే కొత్త వెర్షన్ యాప్ లను 25శాతం వేగంగా పూర్తి చేయొచ్చని పేర్కొంది. ఎం2 మ్యాక్స్ 5 డిస్ ప్లే లను సపోర్టు చేస్తుంది.
- మరోవైపు ఎం2 అల్ట్రా మ్యాక్ స్టూడియో ఎం1 అల్ట్రాతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా ఉంటుందని తెలిపింది. 24 కోర్ సీపీయూ, 76 కోర్ జీపీయూ, 192జీబీ ర్యామ్ 8టీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ఎం2 అల్ట్రా ఎనిమిది డిస్ ప్లే లను సపోర్టు చేస్తుంది.
కొత్త మ్యాక్ ప్రో..
మ్యాక్ ప్రోను సైతం ఎం2 అల్ట్రా చిప్ తో అప్ డేట్ చేశారు. ఇది 24 సీపీయూ కోర్స్, 76 జీపీయూ కోర్స్ ను కలిగి ఉంటుంది. దీంతో 192జీబీ మెమరీ, 8టీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎనిమిది డిస్ ప్లేలను సపోర్టు చేస్తుంది. జనరేషన్ 4ను సపోర్టు చేసే ఏడు పీసీఎల్ఈ ఎక్స్ ప్యాన్షన్ స్లాట్లు, ఆరు ఓపెన్ ఎక్స్ ప్యాన్షన్ స్లాట్లు మ్యాక్ ప్రో లు అందుబాటులో ఉన్నాయి. జూన్ 13 నుంచి ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. దీంట్లో టవర్ ఎన్ క్లోజర్, ర్యాక్ ఎన్ క్లోజర్ రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ధరలు ఇలా..
మ్యాక్ స్టూడియో ఎం2 మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 2,09,900గా ఉంది. అదే ఎడ్యుకేషన్ పర్పస్ అయితే 1,88,900కు లభిస్తుంది. మ్యాక్ ప్రో టవర్ ఎన్ క్లోజర్ ప్రారంభ ధర రూ. 7,29,900గా ఉంటుంది. అదే ఎడ్యుకేషన్ కోసం అయితే రూ. 6,87,900గా ఉంటుంది. మ్యాక్ ప్రో ర్యాక్ ఎన్ క్లోజర్ ప్రారంభ ధర రూ. 7,79,900గా ఉంది. అదే ఎడ్యుకేషన్ కి అయితే రూ. 7,27,900కి వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..