AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steelbird robot 2.0: మార్కెట్ లోకి మరో ’చిట్టి‘.. రోబో 2.0 విడుదల.. దీని ఉపయోగాలు ఇవే.

ద్విచక్ర వాహనాల వినియోగం వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరూ సొంతంగా ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. చదువు, వ్యాపారం, ఉద్యోగం ఇలా ప్రతి అవసరానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు దానిలో ఆయిల్, చక్రాలలో గాలి, బ్రేక్ ల పనితీరు తదితర వాటిని పరిశీలిస్తారు. వీటిలో పాటు హెల్మెట్ ఉంచుకోవడం చాలా అవసరం. ద్విచక్ర వాహనాలపై ప్రయాణాల సందర్భంగా అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి. బండి జారి పడడం, ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీనడం, మీరు సక్రమంగా వెళుతున్నప్పటికీ రాంగ్ రూట్ వచ్చి ఢీకొనడం జరుగుతుంది.

Steelbird robot 2.0: మార్కెట్ లోకి మరో ’చిట్టి‘.. రోబో 2.0 విడుదల.. దీని ఉపయోగాలు ఇవే.
Helmet
Nikhil
|

Updated on: Sep 29, 2024 | 7:32 PM

Share

ద్విచక్ర వాహనాల వినియోగం వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరూ సొంతంగా ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. చదువు, వ్యాపారం, ఉద్యోగం ఇలా ప్రతి అవసరానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు దానిలో ఆయిల్, చక్రాలలో గాలి, బ్రేక్ ల పనితీరు తదితర వాటిని పరిశీలిస్తారు. వీటిలో పాటు హెల్మెట్ ఉంచుకోవడం చాలా అవసరం. ద్విచక్ర వాహనాలపై ప్రయాణాల సందర్భంగా అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి. బండి జారి పడడం, ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీనడం, మీరు సక్రమంగా వెళుతున్నప్పటికీ రాంగ్ రూట్ వచ్చి ఢీకొనడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో హెల్మెట్లు చాలా రక్షణ ఉంటాయి. కిందపడినప్పుడు మీ తలకు దెబ్బతగలకుండా చూస్తాయి. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణంలో మీకు అన్ని విధాలా రక్షణ కల్పించే స్టిల్ బర్డ్ 2.0 హెల్మెట్ మార్కెట్ లోకి విడుదలైంది.

రోబోట్ 2.0 హెల్మెట్

ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్ బర్డ్ మరో కొత్త హెల్మెట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనికి ఎస్ బీహెచ్ – 35 రోబోట్ 2.0 అని పేరు పెట్టింది. డీవోటీ, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన కొత్త హెల్మెట్ ధరను రూ.1,799గా నిర్ణయించింది. మన దేశంతో పాటు విదేశాలలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులకు నాణ్యమైన, అన్ని విధాలా రక్షణ అందించే హెల్మెట్ చాలా అవసరం. అధిక నాణ్యత కలిగిన హెల్మెట్ల వల్ల మరణ ప్రమాదాలను ఆరు రెట్ల తగ్గించవచ్చు.

స్లైలిష్ డిజైన్

స్టీల్ బర్డ్ హెల్మెట్స్ మేనేజర్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ తెలిపిన వివరాల ప్రకారం.. అత్యున్నత ప్రమాణాలతో ఎస్ బీహెచ్ – 35 రోబో 2.0 హెల్మెట్ ను తయారు చేశారు. ఇది రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని ధరించడం వల్ల రక్షణతో పాటు చాలా సౌకర్యం కలుగుతుంది. స్లైలిష్ ఇటాలియన్ డిజైన్ తో టాప్ సేఫ్టీ ఫీచర్లు తో దీన్ని రూపొందించారు.

మూడు రకాల సైజులు

స్టీల్ బర్డ్ రోబోట్ 2.0 హెల్మెట్ మూడు రకాల సైజులలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రైడర్ అవసరాన్ని బట్టి 580 ఎంఎం, 600 ఎంఎం, 620 ఎంఎం సైజులలో రూపొందించారు. మైక్రో మెట్రిక్ బకిల్ డిజైన్ తో తలపై చక్కగా అమరుతుంది. ప్రయాణం సమయంలో సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. హెడ్ ప్రొటెక్టర్ లోని వెంటలేషన్ సిస్టమ్ తో సుదూర ప్రాంతాలకు కూడా చాలా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చికాకు, చెమట, దురద వంటివి రావు. తలకు గాలి చాలా బాగా తగులుతుంది.

ఎన్నో ప్రయోజనాలు

స్టీల్ బర్డ్ రోబోట్ హెల్మెట్ ను శుభ్రం చేసుకోవడం చాలా సులభం. దీన్ని విజర్ పాలికార్పొనేట్ తో తయారు చేశారు. శుభ్రం చేసుకునే సమయంలో గీతాలు పడే అవకాశం తక్కువ. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ హెల్మెట్ మన ప్రయాణంలో తోడుగా ఉంటుంది. అలాగే రైడింగ్ హాబీ ఉన్న మన స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు.