Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale 2023: రూ. 15,000లోపు బెస్ట్ హెచ్‌డీ స్మార్ట్ టీవీలు ఇవే.. రెండు రోజులే అవకాశం.. మిస్ చేసుకోవద్దు..

మీరు ఏదైనా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? చిన్న గదిలోకి తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీ కావాలను అనుకుంటున్నారా? అయితే ఈ కథనం అస్సలు మిస్ అవ్వొద్దు. దీనిలో బెస్ట్ స్మార్ట్ టీవీలు అది కూడా రూ. 15,000 ధరలో ఉండేవి మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 నడుస్తోంది. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్ 15వ తేదీ వరకూ కొనసాగనుంది.

Amazon Sale 2023: రూ. 15,000లోపు బెస్ట్ హెచ్‌డీ స్మార్ట్ టీవీలు ఇవే.. రెండు రోజులే అవకాశం.. మిస్ చేసుకోవద్దు..
Smart Tv
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Oct 13, 2023 | 6:25 PM

మీరు ఏదైనా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? చిన్న గదిలోకి తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీ కావాలను అనుకుంటున్నారా? అయితే ఈ కథనం అస్సలు మిస్ అవ్వొద్దు. దీనిలో బెస్ట్ స్మార్ట్ టీవీలు అది కూడా రూ. 15,000 ధరలో ఉండేవి మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 నడుస్తోంది. అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్ 15వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ సేల్లో స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు అందిస్తోంది. వాటిల్లోని బెస్ట్ ఆప్షన్లు అవి కూడా రూ. 15,000లోపు ధరలోనివి ఇప్పుడు చూద్దాం.

యాసర్ 32-అంగుళాల వీ సిరీస్ టీవీ.. ఇది హెచ్‌డీ రెడీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ టీవీని అమెజాన్ లో రూ. 14,999కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 24,999గా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగిస్తే మరో రూ. 1,500 తక్షణ తగ్గింపు ఉంటుంది. కస్టమర్లు అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ. 4,360 వరకూ తగ్గింపు లభిస్తోంది. గూగుల్ టీవీ సపోర్టు చేస్తుంది. 16జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 30వాట్ల స్పీకర్లను అందిస్తుంది.

రెడ్‌మి స్మార్ట్ టీవీ 32.. అమెజాన్ ప్రస్తుతం రెడ్ మీ ఎఫ్ సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీని రూ. 9,499కే అందిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేసే కస్టమర్‌లు రూ. 1,500 అదనపు తగ్గింపు పొందుతారు. మీరు మీ పాత టీవీని కొత్త మోడల్‌తో భర్తీ చేయాలనుకుంటే అమెజాన్ కూడా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 4,360వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్‌, డాల్బీ ఆడియోతో పాటు 20వాట్ల స్పీకర్లను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎల్జీ 32-అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీ.. ఈ టీవీని అమెజాన్ లో మీరు రూ. 13,490కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 30,990గా ఉంది. ఎస్బీఐ కార్డులను వినియోగిస్తే అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ తో పాటు రూ. 2,200 విలువైన వెల్కమ్ గిఫ్ట్ లు లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ వెబ్ ఓఎస్ పై రన్ అవుతుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 16వాట్ల అవుట్ పుట్ స్పీకర్ను కలిగి ఉంటుంది.

శామ్సంగ్ 32-అంగుళాల వండర్‌టైన్‌మెంట్ సిరీస్ టీవీ.. ఈ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని కేవలం రూ. 11,990కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 22,900గా ఉంది. మీ పాత టీవీని ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 4,360 వరకూ తగ్గింపు ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ. 1,500 వరకూ తగ్గింపు ఉంటుంది. ఈ టీవలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ టెక్నాలజీ, 20వాట్ల అవుట్ పుట్ స్పీకర్తో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..