Amazon Prime: మొబైల్ రీచార్జ్‌తోనే ప్రైమ్ మెంబర్ షిప్.. వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్లాన్స్ ఇవే
అమెజాన్ ప్రైమ్ అనేది కంపెనీ చెల్లింపు సభ్యత్వం. ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలో, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం నెలకు రూ. 179, అలాగే సంవత్సరానికి రూ. 1499 నుండి ప్రారంభమవుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఉచిత, వేగవంతమైన డెలివరీ వంటి ప్రయోజనాలతో పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సభ్యులకు ప్రైమ్ కంటెంట్, మరిన్నింటికి ఉచిత ప్రాప్యతను అందిస్తుంది.

2023కి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15న ప్రారంభమవుతుంది. ఈ సేల్ జూలై 16 వరకు కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది కంపెనీ తన ప్రైమ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ అనేది కంపెనీ చెల్లింపు సభ్యత్వం. ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశంలో, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం నెలకు రూ. 179, అలాగే సంవత్సరానికి రూ. 1499 నుండి ప్రారంభమవుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులపై ఉచిత, వేగవంతమైన డెలివరీ వంటి ప్రయోజనాలతో పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సభ్యులకు ప్రైమ్ కంటెంట్, మరిన్నింటికి ఉచిత ప్రాప్యతను అందిస్తుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, వోడాఫోన్ నుంచి కొన్ని ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాంప్లిమెంటరీని అందిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందించే ఎయిర్‌టెల్, వోడాఫోన్ నుంచి వచ్చే 10 ప్లాన్‌లను చూద్దాం.
ఎయిర్‌టెల్ ప్లాన్స్
- ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 100 జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. అలాగే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వస్తుంది.
- ఈ ఎయిర్‌టెల్ రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 75 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్రో, జుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అలాగే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వస్తుంది.
- ఈ ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 150 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అలాగే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వస్తుంది.
- ఈ ఎయిర్‌టెల్ రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 250 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అలాగే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వస్తుంది.
- ఎయిర్‌టెల్ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కూడా రోజుకు 2.5 జీబీ డేటాతో వస్తుంది. అలాగే అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. ఈ ప్లాన్ చెల్లుబాటు సమయం 84 రోజులు. అలాగే 84 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వస్తుంది.
వొడాఫోన్-ఐడియా ప్లాన్స్
- వొడాఫోన్ ఐడియా రూ. 501 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 90 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్. నెలకు 3,000 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అలాగా 6 నెలల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇస్తారు.
- వొడాఫోన్ ఐడియా రూ. 701 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా అపరిమత డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్. నెలకు 3,000 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అలాగా 6 నెలల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇస్తారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..