Motorola razr 40 Ultra: మడతపెట్టే ఫోన్‌పై మళ్లీరాని ఆఫర్.. ఏకంగా రూ. 45 వేల డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అమెజాన్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగానే అమెజాన్ సేల్లో...
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అమెజాన్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఇందులో భాగంగానే అమెజాన్ సేల్‌లో ఓ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలోనే ఫోల్డబుల్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ సేల్‌లో మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 45,750 తగ్గింపు డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 44,249కే సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా రేజర్ 40 అల్ట్రా లాంచింగ్ సమయంలో రూ. 89,999కి తీసుకొచ్చారు.
అయితే ప్రస్తుతం సేల్లో భాగంగా ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే రూ. 1500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం వల్ల రూ. 42,749 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మోటోరోలా రేజర్ 40 అల్ట్రా ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.9 ఇంచెస్‌తో కూడిన మెయిన్ స్క్రీన్‌ను అందించారు. అలాగే 3.9 ఇంచెస్‌తో కూడిన సెకండరీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఫోన్‌ను ఫోల్డ్ చేసిన సమయంలో ఈ సెకండరీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగాపి పెక్సెల్, 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన అల్ట్రావైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 30 వాట్స్ టర్బో పవర్, 5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే 3800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..