Amazon Festival Sale: నోకియా 5జీ ఫోన్‌పై అదిరే డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే కొనేయొచ్చు.. మిస్ అవ్వొద్దు..
హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలోని నోకియా ఇటీవల లాంచ్ చేసిన నోకియా జీ42 5జీ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భారీ తగ్గింపు లభిస్తోంది. వాస్తవంగా ఈ ఫోన్ కేవలం రూ. 12,599కే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సేల్ కారణంగా ఈ 5జీ ఫోన్ ధర మరింత తగ్గనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ వివరాలతో పాటు నోకియా జీ42 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ప్రైమ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీనిలో అన్ని వస్తువులపై అద్బుతమైన ఆఫర్లు ఉన్నాయి. అక్టోబర్ ఎనిమిది నుంచి అందరికీ ఈ సేల్లోని ఆఫర్లు అందుబాటులోకి వస్తుంది. దీనిలో స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందిస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలోని నోకియా ఇటీవల లాంచ్ చేసిన నోకియా జీ42 5జీ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భారీ తగ్గింపు లభిస్తోంది. వాస్తవంగా ఈ ఫోన్ కేవలం రూ. 12,599కే లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సేల్ కారణంగా ఈ 5జీ ఫోన్ ధర మరింత తగ్గనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ వివరాలతో పాటు నోకియా జీ42 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం..
నోకియా జీ42 5జీపై ఆఫర్లు ఇలా.. నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 12,599 ధరతో మన దేశంలో లాంచ్ అయ్యింది. అయితే అమెజాన్ ఫెస్టివల్ సేల్లో దీనిని మీరు పలు బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 11,999కే పొందొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సో గ్రే, సో పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
నోకియా జీ42 5జీ స్పెసిఫికేషన్లు.. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 720*1612 పిక్సల్స్ రిజల్యూషన్, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ కు గొరిల్లా గ్లాస్ 3 సంరక్షణ ఉంటుంది. ఈ ఫోన్లో ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్ సెట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్ ఉంటుంది. అదనంగా మరో 5జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ వస్తుంది. 1టీబీ వరకూ ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ ఉంటుంది.
డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. తయారీదారు రెండేళ్ల వరకూ ఓఎస్ అప్ డేట్లు, మూడేళ్ల వరకూ సెక్యూరిటీ అప్ డేట్లు ఇస్తుంది.
ఇక కెమెరా పనితీరును చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్పీల కోసం 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.
సేఫ్టీ విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ 3తో స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఐపీ 52 రేటింగ్ తో నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటుంది. 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








