Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Billion Days Sale: 5జీ ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం.. టాప్ బ్రాండ్లు.. అతి తక్కువ ధరకే..

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో అన్ని రంగాలకు చెందిన అనేక ఉత్పత్తులపై అద్బుతమైన ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో టెక్ గ్యాడ్జెట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్, గ‌ృహోపకరణాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బడ్జెట్లో లెవెల్లో స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి న వివరాలు అందిస్తున్నాం. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ. 15,000లోపు ధరలో లభిస్తున్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవి..

Flipkart Big Billion Days Sale: 5జీ ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం.. టాప్ బ్రాండ్లు.. అతి తక్కువ ధరకే..
Best Deals On 5g Phones
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2023 | 8:00 PM

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 మొదలైంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు అక్టోబర్ ఏడో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. సాధారణ ప్రజలకు అక్టోబర్ ఎనిమిది నుంచి ఆఫర్లు అందనున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్లో అన్ని రంగాలకు చెందిన అనేక ఉత్పత్తులపై అద్బుతమైన ఆఫర్లు ఉన్నాయి. వాటిల్లో టెక్ గ్యాడ్జెట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్, గ‌ృహోపకరణాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బడ్జెట్లో లెవెల్లో స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి న వివరాలు అందిస్తున్నాం. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో రూ. 15,000లోపు ధరలో లభిస్తున్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇవి..

ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ.. ఈ ఫోన్ ఈ ఏడాది జూలైలో మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 128జీబీ స్టోరేజ్ తో పాటు 4జీబీ ర్యామ్, అలాగే 8జీబీ ర్యామ్ వేరియంట్లలో లభిస్తోంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుది. 4జీబీ ర్యామ్ వేరియంట్ అసలు రూ. 12,499గా ఉంది కానీ కానీ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ. 11,499.కే కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లను కూడా వినియోగిస్తే మరో రూ. 1000 తగ్గుతుంది.

రియల్ మీ 11ఎక్స్ 5జీ.. ఈ ఏడాదిలో ఆగస్టులో ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 14,999గా ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్లో మీరు దీనిని రూ. 12,999కే పొందొచ్చు. అదనంగా మరో రూ. 1000 బ్యాంక్ ఆఫర్లను పొందొచ్చు. ఈఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ (1,080×2,400 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఎస్ఓసీ ఉంటుంది. మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్‌లలో ఇది అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ.. ఈఫోన్ కూడా జూన్ మాసంలో మన దేశంలో లాంచ్ అయ్యింది. దీని వెనుకైపు 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రిటైల్ ధర రూ. 14,999కాగా.. సేల్లో రూ. 13,499కి కొనుగోలు చేయొచ్చు. రూ. 1000 వరకూ అదనపు బ్యాంకు ఆఫర్లను పొందొచ్చు.

రెడ్ మీ నోట్ 12 5జీ.. ఈ ఏడాది జనవరిలో ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ అయ్యింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 17,999కాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా దీనిని రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా పలు బ్యాంకు ఆఫర్ల సాయంతో రూ. 1000 తగ్గింపును పొందొచ్చు. ఈ ఫోన్లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ.. ఈ ఫోన్ ఆగస్టు నెలలో ప్రారంభమైంది. 6.46-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అమోల్డ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్, ఆర్చిడ్ వైలెట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మీకు రూ. 16,499కు లభిస్తుంది. అదనపు బ్యాంక్ ఆఫర్తో రూ. 1,500 వరకూ తగ్గుతుంది.

మోటోరోలా జీ54 5జీ.. కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. దీని ధర రూ.18,999కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,999కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్లతో రూ.1,000 తగ్గుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..