AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్లను అలా అప్‌డేట్ చేస్తున్నారా.. ప్రమాదం పొంచి ఉందంటోన్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

అయితే మైక్రోసాప్ట్ ఎడ్జ్(Microsoft Edge), గూగుల్ క్రోమ్ బ్రౌజర్(Google Chrome) అప్‌డేట్ ప్రజల ఇబ్బందులను పెంచుతోంది. దీన్ని అప్‌డేట్ చేసిన తర్వాత, సిస్టమ్‌లో ransomware వస్తోన్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారు డేటాకు హాని..

క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్లను అలా అప్‌డేట్ చేస్తున్నారా.. ప్రమాదం పొంచి ఉందంటోన్న నిపుణులు.. ఎందుకో తెలుసా?
Google Chrome
Venkata Chari
|

Updated on: Jan 15, 2022 | 6:10 PM

Share

Magniber Ransomware Vs Hackers: కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర పరికరంలో అప్‌డేట్ వస్తే, మనం కచ్చితంగా వాటిని అప్‌డేట్ చేయాల్సిందే. ఎందుకంటే అందులో మెరుగైన భద్రతను అందించేందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఉంటాయి. పాత వర్షన్‌లోని బగ్‌లను తొలగించి, మరింత రక్షణ అందిస్తాయి. దీంతో వైరస్ లేదా మాల్వేర్(Magniber Ransomware) దాడి ప్రమాదం తగ్గుతుంది. అయితే మైక్రోసాప్ట్ ఎడ్జ్(Microsoft Edge), గూగుల్ క్రోమ్ బ్రౌజర్(Google Chrome) అప్‌డేట్ ప్రజల ఇబ్బందులను పెంచుతోంది. దీన్ని అప్‌డేట్ చేసిన తర్వాత, సిస్టమ్‌లో ransomware వస్తోన్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారు డేటాకు హాని కలిగిస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.

GBhackers.com నివేదిక ప్రకారం, Google Chrome, Microsoft Edge బ్రౌజర్లను అప్‌డేట్ చేసిన తర్వాత Magnibar ransomware సిస్టమ్‌లోకి చొరబడుతోందంట. ఇలాంటి పరిస్థితిలో, ఈ రెండు బ్రౌజర్‌లలో అప్‌డేట్ వస్తే మాత్రం వాటిని అప్‌డేట్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అప్‌డేట్‌ల తర్వాత, Magnibar ransomware మీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మీ డేటాను దొంగిలించడం ద్వారా హ్యాకర్లు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి అనుమతిస్తుందని పేర్కొంది.

Magnibar Ransomware అంటే ఏమిటి? Magnibar ransomware అదేది ఓ వైరస్. ఇది మీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే డేటాతో పాటు ఫోన్‌తోపాటు కంప్యూటర్‌ను దెబ్బతీస్తుంది. మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఇతర మాల్వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Chrome, Edge బ్రౌజర్‌లలో పని చేసినప్పుడు, మాల్వేర్ నకిలీ వెబ్‌పేజీల ద్వారా మన మీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది.

యూజర్లు ‘అప్‌డేట్ క్రోమ్’ లేదా ‘అప్‌డేట్ ఎడ్జ్’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, పేజీ .appx రకం బ్రౌజర్ పొడిగింపును డౌన్‌లోడ్ చేస్తుంది. ఆ తరువాత మీ Windows ఫైల్‌ను పాడు చేయడం ప్రారంభిస్తుంది. దీనిపై యూజర్‌కు ఎటువంటి సమాచారం ఉండకపోవడం గమనార్హం.

Magnibar Ransomware ప్రతికూలతలు? ఇది మీ సిస్టమ్‌లోకి ఎంటర్‌ అయితే, బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లడం ద్వారా అది యాక్టివ్‌గా మారుతుంది. ఇది మీ సిస్టమ్‌లోని అన్ని ఫైల్‌ల ఎన్‌క్రిప్షన్‌ను ప్రారంభిస్తుంది. ఎన్క్రిప్షన్ ప్రక్రియ ముగిసినప్పుడు, మీరు ఇకపై సిస్టమ్‌లోని ఏ ఫైల్‌లను తెరవలేరు.

ఈ సమయంలో, హ్యాకర్లు మీకు రాన్సమ్ నోట్ ప్యాడ్‌ని పంపుతారు. మీరు దాని కోసం డబ్బులు చెల్లిస్తేనే వారు మీ డేటాను యాక్సెస్ చేయగలరు. ఇది మాత్రమే కాదు, ransomware Tor బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయమని కూడా అడుగుతుంది.

Magnibar Ransomwareని ఎలా నివారించాలి?

ప్రస్తుతానికి మీ క్రోమ్ బ్రౌజర్ లేదా ఎడ్జ్ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయవద్దు. ఇది ఆటోమేటిక్ అప్‌డేట్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మాన్యువల్ నవీకరణ లేదు. మాన్యువల్ డౌన్‌లోడ్‌లో, హ్యాకర్లు మిమ్మల్ని నకిలీ పేజీకి తీసుకెళ్లవచ్చు. మీ డేటా బ్యాకప్‌ను ఉంచుకోండి. దీని కోసం, క్లౌడ్ స్టోరేజ్ లేదా ఎక్స్‌డ్రా హార్డ్ డ్రైవ్ ఉపయోగించవచ్చు. ఏదైనా కారణం వల్ల PC ఇన్ఫెక్ట్ అయినట్లయితే, మీ సిస్టమ్‌ని రీసెట్ చేయండి. మీ PC, ల్యాప్‌టాప్‌లో యాంటీవైరస్‌ని ఉపయోగించాలని నిర్ధారించుకోండి. మీ యాంటీవైరస్‌ని అప్‌డేట్ చేస్తూ ఉండండి.

Also Read: Passwords: సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా..? ప్రమాదమే.. వెంటనే మార్చేయండి..!

WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండిలా..!