Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail Scam: జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్.. వెలుగులోకి నయా స్కామ్

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్లల్లో చాలా శాతం గూగుల్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేయడంతో వీటిలోని డేటాను కొట్టేయడానికి స్కామర్లు ఎప్పటికప్పుడు నూతన విధానాలను అవలంభిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జీ-మెయిల్ యూజర్లను టార్గెట్ చేస్తూ సరికొత్త స్కామ్‌కు తెరతీశారు.

Gmail Scam: జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్.. వెలుగులోకి నయా స్కామ్
Follow us
Srinu

|

Updated on: Oct 15, 2024 | 3:17 PM

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్లల్లో చాలా శాతం గూగుల్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేయడంతో వీటిలోని డేటాను కొట్టేయడానికి స్కామర్లు ఎప్పటికప్పుడు నూతన విధానాలను అవలంభిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జీ-మెయిల్ యూజర్లను టార్గెట్ చేస్తూ సరికొత్త స్కామ్‌కు తెరతీశారు. ఖాతా పునరుద్ధరణ అభ్యర్థనలు పంపుతూ వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు. జీ-మెయిల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ స్కామ్‌పై వినియోగదారులు అలెర్ట్ అవ్వాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారంగా చేస్తున్న ఈ మోసానికి గురైతే పెద్ద ఎత్తున వ్యక్తిగత డేటా పొగొట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీ-మెయిల్ యూజర్లను టార్గెట్ చేస్తూ చేస్తున్న మోసం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జీ-మెయిల్ స్కామ్ మీ ఫోన్ లేదా ఈ-మెయిల్‌లో ఊహించని నోటిఫికేషన్‌ ద్వారా ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా మీ జీమెయిల్ ఖాతా పునరుద్ధరణ అభ్యర్థనను ఆమోదించమని నోటిఫికేషన్ వస్తుంది. రికవరీ అభ్యర్థన తరచుగా వేరే దేశం నుండి వస్తుంది. మీరు అభ్యర్థనను తిరస్కరిస్తే స్కామర్‌లు 40 నిమిషాల తర్వాత మళ్లీ మరో నోటిఫికేషన్ పంపుతారు. మిమ్మల్ని నమ్మించడానికి అధికారిక గూగుల్ నెంబర్‌ను తలపించేలా నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మీ అకౌంట్ విదేశాల్లో లాగిన్ చేయడానికి ప్రయత్నించారని చెబుతారు. ముఖ్యంగా మీ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేశారని భయపెడతారు. ఇలా భయపెట్టి ఖాతా పునరుద్ధరణ అభ్యర్థనను ఆమోదించేలా చేస్తారు. ఇలా చేస్తే స్కామర్‌ల చేతికి మన గూగుల్ లాగిన్ వివరాలు చేరతాయి. తద్వారా వారు మన సమాచారాన్ని తస్కరిస్తారు.

జీ-మెయిల్ కుంభకోణం నుంచి రక్షించుకోవడంలో ఖాతాదారులు అప్రమత్తత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీకు బ్లూ కలర్‌లో పునరుద్ధరణ నోటిఫికేషన్‌ వస్తే దానిని ఆమోదించవద్దని సూచిస్తున్నారు. గూగుల్ వ్యాపార సేవలతో పాలుపంచుకోకపోతే గూగుల్ చాలా అరుదుగా వినియోగదారులకు నేరుగా కాల్ చేస్తుంది. మీకు అనుమానాస్పద కాల్ వస్తే ఎంగేజ్ చేయడానికి ముందు ఫోన్ నంబర్‌ను హ్యాంగ్ అప్ చేసి వెరిఫై చేయడం మంచింది. అలాగే స్పూఫ్డ్ ఈ-మెయిల్‌లు గూగుల్ నుంచి వచ్చినట్లుగా కనిపించవచ్చు. కానీ “టు” ఫీల్డ్ లేదా డొమైన్ పేరు వంటి చిన్న వివరాలు తనిఖీ చేస్తే అవి ఒరిజనలో? కాదో? తెలిసిపోతుంది. మీ జీమెయిల్ ఖాతా భద్రతా సెట్టింగ్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి ఏవైనా తెలియని లాగిన్‌ల కోసం ఇటీవలి కార్యాచరణను సమీక్షించాలి. మీ .జీమెయిల్ ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లి, “సెక్యూరిటీ” ట్యాబ్‌పై క్లిక్ చేస్తూ పూర్తి సమాచారం వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
పగోడా, పనికిమాలినోడా.. రూ. 10 కోట్లతో SRH కొంపముంచావ్
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో నితిన్ రాబిన్ హుడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
JEE మెయిన్‌ 2025లో తెలుగోళ్ల సత్తా.. ఈసారి కటాఫ్‌ ఎంతో చూశారా?
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు..ప్రధాని సహా ప్రముఖల శుభాకాంక్షలు
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
బాంద్రా వీధుల్లో రచిన్.. గర్ల్ ఫ్రెండ్ తో వీడియో వైరల్!
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
మెగా DSC 2025 నోటిఫికేషన్ వచ్చేసింది..! జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
వేలు చూపిస్తూ, అసభ్య పదజాలంతో టీమిండియా సీనియర్ ప్లేయర్ హల్చల్
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఓర్నీ.. ఇది ఆటోనా.. విమానమా.. బిజినెస్‌ క్లాస్‌ను మించి వీడియో
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
ఉపేంద్రకు ఇంత పెద్ద కూతురుందా? హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం..
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!
IPL లో మెరిసిన ముగ్గురు.. టీమిండియా జెర్సీకి సన్నాహాలు!