- Telugu News Photo Gallery Technology photos These washing machines are cheap, high in performance, Bumper discount on Amazon, Amazon sale details in telugu
Amazon sale: ఈ వాషింగ్ మెషీన్ల ధర తక్కువ..పనితనం ఎక్కువ.. అమెజాన్‌లో బంపర్ డిస్కౌంట్
నేడు ప్రతి ఇంటిలో వాషింగ్ మెషీన్ వినియోగం సాధారణమైంది. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు కనీస అవసరంగా మారింది. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, సమర్థవంతమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. దీనిలో ఐఎఫ్బీ, ఎల్, సామ్సంగ్, వర్ల్ పూల్, హైయర్ కంపెనీలకు చెందిన వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలను తెలుసుకుందాం.
Updated on: Oct 14, 2024 | 9:01 PM

చిన్న కుటుంబానికి హైయర్ వాషింగ్ మెషీన్ చాలా ఉపయోగంగా ఉంటుంది. అవాంతరాలు లేకుండా సక్రమంగా పనిచేస్తుంది. ఓషనస్ వేవ్ డ్రమ్ టెక్నాలజీ మరకలను సమర్థవంతంగా తొలగిస్తుంది. దుస్తుల తీరుకు అనుగుణంగా వివిధ రకాల మోడ్ లను ఎంపిక చేసుకోవచ్చు. మన్నికైన స్టెయిన్ లెన్స్ స్టీల్ డ్రమ్, 780 ఆర్పీఎం దీని ప్రత్యేకతలు. హైయర్ 7 కేజీ 5 స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ను అమెజాన్ లో రూ.13,790కి కొనుగోలు చేసుకోవచ్చు.

ఏడు కిలోల సామర్థ్యం కల ఐఎఫ్బీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ దుస్తులను చాాలా సమర్థంగా ఉతుకుతుంది. ఐదుగురు సభ్యులుండే కుటుంబానికి సరిపోతుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో దుస్తులను చాలా బాాగా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా ఏఐ శక్తిని ఉపయోగించుకుని సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రాబ్రిక్ రకం, ధూళి తదితర వాటిని గుర్తిస్తుంది. దీనిలో ఎనిమిది రకాల వాష్ ప్రోగ్రాములున్నాయి. 1000 ఆర్పీఎం కారణంగా బట్టలను ఎక్కువ సేపు ఎండలో ఆరబెట్టే అవసరం ఉండదు. అంతర్నిర్మిత వాటర్ హీటర్, బ్యాక్టీరియా తొలగింపునకు డబుల్ పవర్ స్టీమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఐఎఫ్బీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ను అమెజాన్ లో రూ.26,990కు కొనుగోలు చేసుకోవచ్చు

దేశంలో ప్రముఖ బ్రాండ్ అయిన ఎల్ జీ నుంచి విడుదలైన ఈ ఏడు కేజీల వాషింగ్ మెషీన్ పనితీరు చాలా ఆకట్టుకుంటుంది. టర్బోడ్రమ్ టెక్నాలజీతో దుస్తులను శుభ్రంగా ఉతుకుతుంది. 700 ఆర్ పీఎం అధిక స్పీన్ వేగంతో బట్టలను తిప్పుతుంది. ఏడు రకాల వాష్ ప్రోగ్రామ్ ల నుంచి నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. అత్యవసర సమయంలో 15 నిమిషాల్లో దుస్తులను శుభ్రపరిచే క్విక్ వాష్ మోడ్ కూడా ఉంది. ఎల్ జీ 7 కేజీల ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ అమెజాన్ లో రూ.17,490 ధరకు అందుబాటులో ఉంది.

సామ్సంగ్ వాషింగ్ మెషీన్ ను అన్ని వయసుల వారూ సులభంగా వినియోగించుకోవచ్చు. బట్టలు వేయడం, తీయడం చాాలా సులభం. దీనిలోని డిజిటల్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ మెటీరియల్ కారణంగా మన్నిక చాలా బాగుంటుంది. రోజు వారీ దుస్తులను శుభ్రం చేసుకునేందుకు 15 నిమిషాల మోడ్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు ఆరు రకాల వాష్ ప్రోగ్రామ్ లను ఎంచుకోవచ్చు. సామ్సంగ్ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ అమెజాన్ లో రూ.17,690కి అందుబాటులో ఉంది.

ఉత్తమ వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. కఠిన మైన నీటితో కూడా దుస్తులను శుభ్రంగా ఉతుకుతుంది. దీనిలో జెడ్ పీఎఫ్ టెక్నాలజీతో నీరు తక్కువగా ఉన్నా మెరుగైన శుభ్రత నిస్తుంది. దీనిలోని డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ లో మూడు దశల బటన్లు ఉన్నాయి. 5 స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్ కలిగిన ఈ వాషింగ్ మెషీన్ పనితీరు చాలా స్మార్ట్ గా ఉంటుంది. దీనిలో ఆటో టబ్ క్లీన్ మోడ్ ఉంది. దుస్తులు ఉతికిన తర్వాత టబ్ ను ఆటో మేటిక్ గా శుభ్రం చేస్తుంది. వర్ల్ పూల్ 7కేజీల 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ అమెజాన్ లో రూ.14,990కు అందుబాటులో ఉంది.




