AI Stethoscope: గుండె సమస్యల ప్రమాదాన్ని 15 సెకన్లలో చెప్పే డివైజ్!
ఒకప్పుడు గుండె జబ్బులను నిర్ధారించడానికి చాలా సమయం పట్టేది. కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇది కేవలం కొన్ని సెకన్లలోనే సాధ్యమవుతుంది. లండన్‌లోని పరిశోధకులు ఏఐ సాంకేతికతతో పనిచేసే ఒక కొత్త స్టెతస్కోప్‌ను తయారుచేశారు. ఇది గుండె సంబంధిత వ్యాధులను త్వరగా, కచ్చితంగా గుర్తించగలదు. ఈ సరికొత్త ఆవిష్కరణ వైద్యరంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కేవలం 15 సెకన్లలోనే గుండె జబ్బులను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల వైద్య రంగంలో ఏఐ వాడకం పెరిగింది. ఇది వ్యాధులను సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఏఐతో నడిచే స్టెతస్కోప్‌ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం 15 సెకన్లలో మూడు రకాల గుండె జబ్బులను గుర్తించగలదు.
ఏఐ స్టెతస్కోప్ ఎలా పని చేస్తుంది?
పాత స్టెతస్కోప్ కేవలం రోగి గుండె చప్పుడు, శ్వాసను మాత్రమే వినగలదు. కానీ ఏఐతో నడిచే ఈ స్టెతస్కోప్ గుండె చప్పుడు, రక్త ప్రవాహంలో వచ్చే చిన్న మార్పులను కూడా గుర్తించగలదు. అంతేకాదు, ఇది ఈసీజీ తీయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం రోగి ఛాతిపై ఉంచితే, అది గుండె నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌తో పాటు, గుండెకు రక్తం ప్రవహించే శబ్దాలను రికార్డు చేస్తుంది. ఒక ఏఐ అల్గోరిథం ఈ సమాచారాన్ని విశ్లేషిస్తుంది. సాధారణంగా వైద్యులు గుర్తించలేని మార్పులను ఈ అల్గోరిథం రికార్డు చేస్తుంది. ఈ సమాచారాన్ని రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపుతుంది.
ఏఐ స్టెతస్కోప్‌తో గుర్తింనచగల వ్యాధులు
గుండె ఆగిపోవడం (Heart Failure)
ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (అసాధారణ గుండె లయ)
వాల్యులర్ గుండె వ్యాధి
పరిశోధకుల అభిప్రాయం
పరిశోధకులు ఈ పరికరం వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని చెబుతున్నారు. దీనితో రోగులకు సకాలంలో చికిత్స అందించవచ్చు. ఈ పరికరం ద్వారా గుండె వైఫల్యం వచ్చే అవకాశం ఉన్నవారిని 12 నెలల్లో గుర్తించవచ్చని తేలింది. ఏఐ స్టెతస్కోప్‌తో పరీక్షలు చేస్తే, గుండె వైఫల్యం ఉన్నవారిలో 12 నెలల్లో వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం 2.33 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. అదేవిధంగా, అసాధారణ గుండె లయను 3.5 రెట్లు, గుండె వాల్వ్ సమస్యలను 1.9 రెట్లు ఎక్కువగా గుర్తించవచ్చని తేలింది.
గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు చికిత్స లేదా వైద్య సలహా కోసం నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం మంచిది.




