Aditya L1 Mission Launch Highlights: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1..
మరో అంతరిక్ష అద్భుతానికి నాంది పడింది. సూర్యుడిపై రహస్యాలను చేధించేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతగా మొదలైంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. నెలల పాటు ప్రయాణించి ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించనుంది. సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగాలు చేయనుంది. ఎలాంటి అవంతరాలు లేకుండా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళుతుంది...

PSLV-C57/Aditya L1 Solar Mission Launch Highlights: సూర్యుడిపై ఉన్న రహస్యాలను చేధించడమే లక్ష్యంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్వి సీ 57 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లింది. ఆదిత్య ఎల్1ను నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ తీసుకెళ్లింది. సూర్యుడిపై పరిశోధనలు నిర్వహించేందకుగాను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరించనున్నారు. అక్కడి నుంచి సూర్యుడి ఉపతలంపై ప్రయోగాలు చేయనుంది.
శుక్రవారం మధ్యాహ్నం 11.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ఈ రోజు ఉదయం 11.50 గంటల వరకు కొనసాగింది. ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. మొదటి దశలో 20 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వ్యాసార్థం కలిగిన రాకెట్‌లో 138 టన్నుల ఘన ఇంధనం నింపారు. దీని చుట్టూ ఆరు స్ట్రాఫాన్ బూస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 12 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఇవన్నీ కలిపి భారీ రాకెట్‌ను అంతరిక్షంలోకి మోసుకువెళ్తాయి.
ఇక ఇక రెండోదశలో 12.8 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వెడల్పు వ్యాసార్ధంలోని రాకెట్ మోటారులో 41 టన్నుల ధ్రవ ఇంధనం నింపారు. తొలిదశ పూర్తవగానే రెండోదశ ఇంజన్ మండుతూ ప్రారంభం అవుతుంది. మూడో దశలో మూడున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు వ్యాసార్ధం ఉండే రాకెట్ భాగంలో ఏడున్నర టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. రెండోదశ విడిపోగానే మూడోదశలో రాకెట్‌ను మరింత పైకి తీసుకువెళ్లడం మొదలు పెడుతుంది. నాలుగో దశలో రెండున్నర మీటర్లు, దాదాపు మీటరున్నర వెడల్పు వ్యాసార్ధంలో ఉన్న రాకెట్‌లో రెండున్నర టన్నుల ధ్రవ ఇంధనం నింపారు. ఈ దశలో రాకెట్ ఇస్రో నిర్దేశించిన ఎత్తుకు చేరుకుంటుంది. అనంతరం ఇందులో ఉండే ఉపగ్రమాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విడిచిపెట్టడంతో చివరి దశ పూర్తవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..
LIVE NEWS & UPDATES
-
రెండో దశ విజయం..
ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ విజయవంతంగా ఆదిత్య ఎల్1ను తీసుకెళ్తుంది. ఈ క్రమంలో రెండు దశలు విజయవంతంగా ముగిశాయి. మూడో దశ ప్రారంభం కాగా విజయవంతంగా ముందుకు సాగుతోంది.
-
నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్1..
మరో అంతరిక్ష అద్భుతానికి నాంది పడింది. సూర్యుడిపై రహస్యాలను చేధించేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతగా మొదలైంది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. నెలల పాటు ప్రయాణించి ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించనుంది. సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగాలు చేయనుంది. ఎలాంటి అవంతరాలు లేకుండా రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళుతుంది.
-
-
నాలుగో దశలో..
నాలుగో దశలో రెండున్నర మీటర్లు, దాదాపు మీటరున్నర వెడల్పు వ్యాసార్ధంలో ఉన్న రాకెట్‌లో రెండున్నర టన్నుల ధ్రవ ఇంధనం నింపారు. ఈ దశలో రాకెట్ ఇస్రో నిర్దేశించిన ఎత్తుకు చేరుకుంటుంది. అనంతరం ఇందులో ఉండే ఉపగ్రమాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విడిచిపెట్టడంతో చివరి దశ పూర్తవుతుంది.
-
మూడో దశలో..
మూడో దశలో మూడున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు వ్యాసార్ధం ఉండే రాకెట్ భాగంలో ఏడున్నర టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. రెండోదశ విడిపోగానే మూడోదశలో రాకెట్‌ను మరింత పైకి తీసుకువెళ్లడం మొదలు పెడుతుంది.
-
రెండో దశలో ఏం జరుగుతుందంటే..
ఇక రెండోదశలో 12.8 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వెడల్పు వ్యాసార్ధంలోని రాకెట్ మోటారులో 41 టన్నుల ధ్రవ ఇంధనం నింపారు. తొలిదశ పూర్తవగానే రెండోదశ ఇంజన్ మండుతూ ప్రారంభం అవుతుంది.
-
-
ప్రయోగం 4 దశల్లో జరగనుంది..
ఆదిత్య ఎల్1 ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో జరగనుంది. మొదటి దశలో 20 మీటర్ల పొడవు, 2.8 మీటర్ల వ్యాసార్థం కలిగిన రాకెట్‌లో 138 టన్నుల ఘన ఇంధనం నింపారు. దీని చుట్టూ ఆరు స్ట్రాఫాన్ బూస్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 12 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. ఇవన్నీ కలిపి భారీ రాకెట్‌ను అంతరిక్షంలోకి మోసుకువెళ్తాయి.
-
శుక్రవారం మొదలైన కౌంట్‌డౌన్..
ఆదిత్య ఎల్1 సోలర్ మిషన్‌కు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 11.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దాదాపు 24 గంటల 40 నిమిషాలపాటు కొనసాగిన కౌంట్‌డౌన్.. శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్1 నింగిలోకి దూసుకెళ్లనుంది.
-
ఆదిత్య-ఎల్1 మిషన్ ఖర్చు ఎంతో తెలుసా.?
సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం ఆదిత్య-ఎల్ 1కు అవుతున్న ఖర్చు కేవలం 400 కోట్ల రూపాయలు. సరిగ్గా ఇలాంటి ప్రయోగం కోసం అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ నాసా పెట్టిన ఖర్చు కన్నా ఇది 97 శాతం తక్కువ. మొత్తం 12,300 కోట్ల రూపాయలను నాసా ఖర్చు పెట్టింది. అయితే ఇస్రో ప్రయోగాలన్నీ తక్కువ ఖర్చుతో చేస్తున్నవే. దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇటీవలే విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ కన్నా ఆదిత్య L1 కోసం 200 కోట్ల రూపాయలు తక్కువ చేశారు.
Published On - Sep 02,2023 10:18 AM




