Acer smart tv: పండుగకు కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఏసర్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ టీవీలు వచ్చేశాయ్‌..

Acer smart tv: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి రావడంతో పెద్ద స్క్రీన్‌తో కూడిన టీవీలను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలన్నీ టీవీలను...

Acer smart tv: పండుగకు కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఏసర్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ టీవీలు వచ్చేశాయ్‌..
Acer Smart Tv
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2022 | 10:27 AM

Acer smart tv: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి రావడంతో పెద్ద స్క్రీన్‌తో కూడిన టీవీలను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలన్నీ టీవీలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఏసర్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేసింది. ఏసర్‌ ఎస్‌ సిరీస్‌, ఎసెర్‌ హెచ్‌ సిరీస్‌తో రెండు కొత్త టీవీలను విడుదల చేసింది. 32,43,50,55,65 ఇంచెస్‌ సైజ్‌లో ఈ టీవీలను లాంచ్‌ చేశారు. ఈ టీవీల ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

ఏసర్‌ ఎస్‌ సిరీస్‌..

ఈ స్మార్ట్‌ టీవీలో 32,65 ఇంచెస్‌ స్క్రీన్‌తో కూడిన రెండు టీవీలను తీసుకొచ్చారు. 32 ఇంచెస్‌ స్క్రీన్‌ టీవీలో హెచ్‌డీఆర్‌ 10+ సపోర్ట్‌ ఇస్తే, 65 ఇంచెస్‌ మోడల్‌లో హెచ్‌డీఆర్‌ 10+తో పాటు హెచ్‌ఎల్‌జీ సపోర్ట్‌ను కూడా అందించారు. అలాలే 32 ఇంచెస్‌ వెర్షన్‌లో 40 వాట్ స్పీకర్‌, 65 ఇంచెస్‌ టీవీలో 50 వాట్‌ హైపవర్‌ సౌండ్‌ స్పీకర్లను ఇచ్చారు. ధర విషయానికొస్తే వరుసగా 32,65 ఇంచెస్‌ టీవీలు రూ. 14,999, రూ. 64,999గా ఉన్నాయి. ఈ రెండు టీవీల్లో డిజిటల్‌ నాయిస్‌ రిడక్షన్‌, మైక్రో డిమ్మింగ్‌, బ్లూ లైట్‌ రిడక్షన్‌ వంటి ఫీచర్లను అందించారు.

ఏసర్‌ హెచ్‌ సిరీస్‌..

ఈ సిరీస్‌లో 43,50,55 ఇంచెస్‌ స్క్రీన్స్‌తో మొత్తం మూడు టీవీలను లాంచ్‌ చేశారు. 43 ఇంచెస్‌ టీవీ ధర రూ. 29,999 కాగా, 50 ఇంచెస్‌ స్క్రీన్‌ వేరియంట్‌ ధర రూ. 34,999గా ఉంది. ఇక 55 ఇంచెస్‌ టీవీ ధర రూ. 39,999గా ఉంది. అన్ని టీవీల్లోనూ ఒకేరమైన ఫీచర్లను అందించారు. డాల్బీ విజన్‌, అల్ట్రా హెచ్‌డీ అప్‌స్కేలింగ్‌, మైక్రో డిమ్మింగ్, 60 వాట్‌ హైఫై స్పీకర్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లను అందించారు. అన్నీ టీవీల్లో కోర్‌టెక్స్‌-ఏ55 ప్రాసెసర్‌ను అందించారు. ఈ టీవీలు ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..