- Telugu News Photo Gallery Technology photos Qubo company launches new smart go sunglasses features and price details Telugu Tech News
Qubo go sunglasses: మార్కెట్లోకి కొత్త సన్‌గ్లాసెస్.. కాల్స్ నుంచి మ్యూజిక్ వరకు, కేక పుట్టిస్తోన్న ఫీచర్లు..
Qubo go sunglasses: క్యూబో అనే కంపెనీ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను లాంచ్ చేసింది. మొబైల్ ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ గ్లాసెస్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించారు. ఈ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 19, 2022 | 12:28 PM

సన్‌గ్లాసెస్ కంటే కేవలం ఎండ నుంచి కంటికి రక్షణ ఇచ్చేవని మనకు తెలుసు. అలా కాకుండా సన్ గ్లాసెస్‌తో ఫోన్ మాట్లాడుకునే వీలు ఉంటే ఎలా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. క్యూబో అనే కంపెనీ రూపొందించిన క్యూబో గో ఆడియో సన్‌గ్లాసెస్ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తోంది.

క్యూబో గో ఆడియో పేరుతో లాంచ్ చేసిన ఈ సన్‌గ్లాసెస్‌ను బ్లూటూత్‌తో ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను మాట్లాడుకోవచ్చు.

ఒక్కసారి చార్జ్ చేస్తే నిరంతరాయంగా 6 గంటలలు పనిచేయడం ఈ గ్లాసెస్ ప్రత్యేకత. బ్లూటూత్ 5.0తో పనిచేసే ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ ఇన్‌బుల్ట్ మైక్‌ను ఇచ్చారు.

ఈ గ్లాసెస్ హే సిరి, ఓకే గూగుల్ వంటి వాయిస్ కమాండ్స్‌కు కూడా పనిచేస్తాయి. దీంతో ఒక్క కమాండ్‌తో ఫోన్ కాల్స్, మ్యాప్స్ వంటి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఇందులో ఉండే చిన్న ఓపెన్ స్పీకర్‌తో మ్యూజిక్‌ను కూడా వినొచ్చు. క్యూబో యాప్ ద్వారా ఈ గ్లాసెస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్ అసలు ధర రూ. 9,990 కాగా ప్రస్తుతం డిస్కౌంట్ భాగంగా రూ. 5,490కే అందుబాటులో ఉంది.




