AC Tips: మీ ఇంట్లో ఏసీ ఉందా? చిన్న పొరపాటుతో పెద్ద ప్రమాదం.. ఇవి తెలుసుకోండి!
ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతల మధ్య ఏసీ కింద ఉండటం ఉత్తమం. ఎందుకంటే వేడిని తట్టుకోలేక చాలా ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏసీ ఏర్పాటు చేయడమే కాకుండా వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు. భారతదేశంలోని చాలా ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది తమ ACలు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు..

ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉష్ణోగ్రతల మధ్య ఏసీ కింద ఉండటం ఉత్తమం. ఎందుకంటే వేడిని తట్టుకోలేక చాలా ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఏసీ ఏర్పాటు చేయడమే కాకుండా వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు. భారతదేశంలోని చాలా ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది తమ ACలు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. చాలా మంది తమ ఎయిర్ కండీషనర్ చాలా వేగంగా ట్రిప్ అవుతుందని, కంప్రెసర్ తిరగలేకపోతుందని ఆందోళన చెందుతున్నారు. స్ప్లిట్ లేదా విండో అయినా ఏసీ కంప్రెసర్ ఆన్ చేసే వరకు చల్లని గాలి రాదు.
ఢిల్లీకి చెందిన స్థానిక ఏసీ టెక్నీషియన్ సలీం తెలిపిన వివరాలను చూస్తే.. విపరీతమైన వేడి కారణంగా ఇలా జరుగుతోందని తేలింది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిన తర్వాత AC చల్లబరచడానికి చాలా కష్టపడాలి. అది వేగంగా వేడెక్కుతుంది. దీని కారణంగా ఇది మళ్లీ మళ్లీ రన్ అవుతుంటుంది. అలాగే కంప్రెసర్ ప్రారంభం కాదు.
మధ్య మధ్యలో స్విచ్ ఆఫ్ చేయండి:
ఈ వేడిలో ఏసీ లేకుండా బతకలేం కానీ, ఏసీని నడుపుతున్నప్పుడు మధ్యలో 7 నుంచి 9 నిమిషాల పాటు స్విచ్ ఆఫ్ చేయాలని టెక్నీషియన్ చెప్పారు. ఇలా చేయకుంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందటున్నారు. ఎందుకంటే వేసవిలో కంప్రెసర్ కూడా వేగంగా వేడెక్కుతుంది. దానిని స్విచ్ ఆఫ్ చేయకుండా ఎక్కువసేపు ఉంచినట్లయితే, అప్పుడు వేడెక్కడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏసీని కంటిన్యూగా నడపడం మంచిది కాదంటున్నారు.
మీరు స్ప్లిట్ ఏసీ కలిగి ఉంటే, ప్రత్యక్ష సూర్యకాంతి దాని అవుట్‌డోర్ యూనిట్‌పై పడితే, దీని కారణంగా కంప్రెసర్ చల్లబడదు. అందుకే మీరు చేయాల్సిందల్లా దాని బయటి యూనిట్‌పై నీడ ఏర్పాటు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఏసీ కంప్రెసర్‌పై ప్రభావం 5-6 డిగ్రీలు తగ్గుతుందని టెక్నిషియన్లు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
