Tomato: టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే తాజాగా ఉంచుకోవచ్చు.. అదేలాగో తెలుసా? అద్భుతమైన టిప్స్
Tips to keep Tomato Fresh: టమోటాలు ఇతర కూరగాయలు, పప్పులు, సలాడ్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది చాలా సాధారణమైన కూరగాయ. దీనిని ప్రతి ఇంట్లో రోజూ వాడతారు. కానీ సరిగ్గా ఉంచకపోతే చాలా త్వరగా పాడైపోతుంది. అటువంటి పరిస్థితిలో, టమోటాలు చెడిపోకుండా ఉండేందుకు చాలా మంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. మరి ఫ్రిజ్ లేనివారి సంగతి ఏంటి. అయితే మీ వద్ద ఫ్రిజ్

Tips To Keep Tomato Fresh
Tips to keep Tomato Fresh: టమోటాలు ఇతర కూరగాయలు, పప్పులు, సలాడ్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది చాలా సాధారణమైన కూరగాయ. దీనిని ప్రతి ఇంట్లో రోజూ వాడతారు. కానీ సరిగ్గా ఉంచకపోతే చాలా త్వరగా పాడైపోతుంది. అటువంటి పరిస్థితిలో, టమోటాలు చెడిపోకుండా ఉండేందుకు చాలా మంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. మరి ఫ్రిజ్ లేనివారి సంగతి ఏంటి. అయితే మీ వద్ద ఫ్రిజ్ లేన్నా వాటిని నిల్వ చేయడానికి కొన్ని పద్ధతులను అనుసరించండి. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా టమోటాలు ఎక్కువ కాలం పాడైపోకుండా కాపాడుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ లేకుండా టమోటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి.
- మీరు రిఫ్రిజిరేటర్ లేకుండా టమోటాలు తాజాగా ఉంచాలనుకుంటే, వాటిని చల్లని ప్రదేశంలో ఉంచండి. చాలా మంది వాటిని వంటగదిలో మాత్రమే ఉంచుతారు. దీని కారణంగా అవి త్వరగా పాడవుతాయి. అటువంటి పరిస్థితిలో టొమాటోలను నిల్వ చేయడానికి ఒక కంటైనర్‌ను ఉపయోగించండి. ఆపై టమోటాలను బాగా ఆరబెట్టండి, గాలి లోపలికి, బయటికి వెళ్లే కంటైనర్‌లో ఉంచండి.
- టమాటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అర టీస్పూన్ ఉప్పు, పసుపు కలిపిన నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి శుభ్రమైన నీటితో కడిగి తుడవాలి. ఇప్పుడు ఓపెన్‌గా ఉన్న ఓ పాత్రలో సాధారణ కాగితాన్ని వేయండి. అలాగే టొమాటోలను కాగితంలో చుట్టి ఉంచండి.
- ఈ పద్ధతిని అనుసరించడానికి, టమోటాలను శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత శుభ్రమైన గుడ్డలో ఆరబెట్టాలి. టొమాటోలను అదే గుడ్డలో చుట్టి, వాటిని ఒక ఓపెన్ బాక్స్‌లో ఉంచి, వారానికి ఒకసారి కొన్ని నిమిషాల పాటు తేలికపాటి సూర్యరశ్మికి ఉంచండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
