chahal marriage: ఇంటివాడైన టీమిండియా క్రికెటర్ చాహల్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వెడ్డింగ్ ఫోటోలు..
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్, పాపులర్ యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను..
chahal marriage: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్, పాపులర్ యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను మంగళవారం నాడు వివాహమాడాడు. గురుగ్రామ్‌లో జరిగిన వీరి వివాహానికి అతి కొద్ది మంది మంది మాత్రమే హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమైన బంధువులు, స్నేహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ధనశ్రీతో చాహల్‌కు ఆగస్టులోనే నిశ్చితార్థం అయ్యింది. ఈ నిశ్చితార్థం కూడా కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఎవరికీ చెప్పకుండా చేసుకున్నాడు. ఆ తరువాత ధనశ్రీతో నిశ్చితార్థం అయ్యిందంటూ చాహల్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా చాహల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అభిమాలు చాహల్‌కు విష్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: