jammu and kashmir election result: తొలిసారి లోయలో బోణీ కొట్టిన బీజేపీ.. జమ్మూ కశ్మీర్‌ స్థానిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరణ..

నెలల తరబడి నిర్బంధాలు, నిరసనలు, కర్ఫ్యూలు, ఆంక్షలు అనంతరం జమ్మూకశ్మీర్‌లో తొలిసారి జరిగిన డీసీసీ( జిల్లా అభివృద్ధి మండళ్లు) ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది.

jammu and kashmir election result: తొలిసారి లోయలో బోణీ కొట్టిన బీజేపీ.. జమ్మూ కశ్మీర్‌ స్థానిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరణ..
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Dec 23, 2020 | 9:50 AM

jammu and kashmir election result: నెలల తరబడి నిర్బంధాలు, నిరసనలు, కర్ఫ్యూలు, ఆంక్షలు అనంతరం జమ్మూకశ్మీర్‌లో తొలిసారి జరిగిన డీసీసీ( జిల్లా అభివృద్ధి మండళ్లు) ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా మొత్తం డీసీసీల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఇక ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఏడు పార్టీల కూటమి గుప్కార్ అలయెన్స్(పీఏజీడీ) భారీ సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ.. పార్టీ పరంగా గెలిచిన సీట్ల ప్రకారం బీజేపీనే అగ్రస్థానంలో ఉంది. జమ్మూకశ్మీ్ర్‌లో మొత్తం 280 డీసీసీలకు నవంబరు 28 నుంచి డిసెంబరు 19దాకా ఎనిమిది విడతల్లో ఈ స్థానిక ఎన్నికలు జరుగగా.. మంగళవారం నాడు కౌంటింగ్ చేపట్టారు.

అయితే ప్రస్తుతానికి పీఏడీజీ 117 స్థానాలు, బీజేపీ 72, స్వతంత్రులు 40, కాంగ్రెస్ 23 స్థానాలను గెలుపొంది. దీని ప్రకారం.. జమ్మూ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని బీజేపీ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇక లోయలోనూ బీజేపీ తొలిసారి బోణీ కొట్టింది. ఈ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. గుప్కార్ అలయెన్స్‌కే ప్రజలు పట్టం కట్టారని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును కశ్మీరీలు పూర్తిగా వ్యతిరేకించారన్న విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.

Also read:

విశాఖలో పేలిన పొలిటికల్‌ ల్యాండ్‌మైన్.. జీవీఎంసీ ఎన్నికల ముందు రేగిన రాజకీయ ప్రకంపనలు.. ఆ ఇద్దరి మధ్య బిగ్ వార్

టాలీవుడ్ సూపర్ స్టార్ స్టామినా.. వైరల్ అవుతున్న మహేష్ బాబు 11 మిలియన్ యాష్ ట్యాగ్