రెండో టీ20లో భారత్‌పై వెస్టిండీస్ ఘనవిజయం
భారత్‌తో జరుగుతున్న రెండో టీ 20లో విండీస్.. ఘన విజయం సాధించింది. మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి.. 170 పరుగులు చేసింది. శివమ్ దూబే (54) హాఫ్ సెంచరీతో.. భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగల్గింది. అయితే 171 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి..18.3 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. సిమన్స్, […]
భారత్‌తో జరుగుతున్న రెండో టీ 20లో విండీస్.. ఘన విజయం సాధించింది. మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి.. 170 పరుగులు చేసింది. శివమ్ దూబే (54) హాఫ్ సెంచరీతో.. భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగల్గింది. అయితే 171 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి..18.3 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది. సిమన్స్, లూయిస్‌లు చెలరేగడంతో.. విండీస్ సులువుగా విజయం సాధించింది. సిమ్మన్స్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల బాది 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక లూయిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 40 పరుగులు చేయగా.. మరో ఆటగాడు హిట్‌మైర్ కూడా 23 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక చివర్లో పూరన్.. 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విండీస్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం అయ్యింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ తీశారు.
కాగా, తోలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఆటగాడు శివమ్ దూబే(54) హాఫ్ సెంచరీ చేయగా.. రిషభ్ పంత్ 33 పరుగులతో రాణించారు. మిగితా బాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవ్వడంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లతో కేవలం 170 పరుగులు మాత్రమే చేసింది. కాగా, కీలకమైన మూడో టీ 20 మ్యాచ్.. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ నెల 11న జరుగనుంది.